మళ్లీ పెరిగిన పసిడి ధర

Gold
Gold

న్యూఢిల్లీ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పసిడికి డిమాండ్‌ పెరుగుతోంది. వరుసగా నాలుగు రోజుల పాటు
తగ్గుతూ వచ్చిన పసిది ధర నేడు పెరిగింది. నేటి బంగారం ధర రూ.150 పెరగడంతో పదిగ్రామల పసిడి ధర  రూ.30,750కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పసిడి ధరలు పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పసిడితో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. వెండి రూ.400 పెరగడంతో కిలో వెండి రూ.40,900కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ దృష్ట్యా వెండి ధర పెరిగినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.