మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులవైపు ‘ఐటిసి

ITC
ITC

మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల వైపు ‘ఐటిసి’

 

కోల్‌కత్తా: విభిన్నరంగాలకు విస్తరిం చిన ఐటిసి గ్రూప్‌ తాజాగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులరంగానికి వస్తోంది. మెడికల్‌ టూరి జం విభాగంలో ఆసుపత్రులను ఏర్పాటు చేయ డం ద్వారా ఈ రంగంలో కూడా తన ముద్రవేసు కోవాలని చూస్తోంది. ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులు, సిగరెట్లు ఉత్పత్తిలో కీలకం అయిన కోల్‌ కత్తా కేంద్రంగా ఉన్న ఈ సంస్థ ఆసుపత్రుల ఏర్పాటుకు సంబంధిం చి వాటాదారుల ఆమోదం పొందేందు కు కృషిచేస్తోంది. హెల్త్‌కేర్‌ రంగంలోనికి రావ డం ద్వారా భారత్‌కు పెరుగుతున్న మెడికల్‌ టూరిజం రంగాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోం ది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పెషా లిటీ ఆసుపత్రులను ఏర్పాటుచేస్తామని ఐటిసి వాటాదారులకు పంపించిన నోటీసులో వెల్లడిం చింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలనిర్వ హణలో కంపెనీ అగ్రామిగానే కొనసాగుతోంది. వీటికితోడు ఇప్పటికే ఎఫ్‌ఎంసిజి రంగంలో అగ్ర గామి అయిన కంపెనీ హెల్త్‌కేర్‌రంగంలో కూడా విశిష్టస్థానం సాధించాలన్న లక్ష్యంతో ఆసుపత్రు లు స్థాపించేనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.