మలేరియాతో రక్తహీనత

FEVER
FEVER

మలేరియాతో రక్తహీనత

దోమలున్న వాతావరణంలో జీవించడం మనిషికి దుర్భరంగా ఉంటుంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దోమలు కనిపిస్తున్నాయి. దోమలుంటే మనిషి ప్రశాంతంగా నిద్రపోలేడు. ప్రజారోగ్యానికి దోమలు ఒక సవాల్‌గా పరిణమించాయంటే అతిశయోక్తి కాదు.

దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల్లో ప్రధానమైనది మలేరియా. గత కొన్ని దశాబ్దాలుగా దోమలను నిర్మూలించడానికి తద్వారా మలేరియా అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. కాని ఆ యత్నాలు పూర్తిగా సఫలీకృతం కావడం లేదు. ఎనాఫిలిస్‌ అనే ఒక ప్రత్యేక తరహా దోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు మురికి నీళ్లలోనూ, చెత్తాచెదారాల్లోనూ వృద్ధి చెందడమే కాకుండా, నిలువ ఉన్న పరిశుభ్రమైన నీటి మీద కాపురం చేస్తుంటాయి. ప్లాస్మోడియం అనే ఒక సూక్ష్మక్రిమి వలన మలేరియా వస్తుంది.

ఈ సూక్ష్మక్రిమి ఆడ దోమ లాలాజల గ్రంథుల్లో నివాసం ఏర్పరచుకుంటుంది. మనిషిని ఆడ దోమ కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా ఈ క్రిమి అతడి చర్మంలోకి ప్రవేశించి అక్కడి నుంచి అతడి రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఈ సూక్ష్మక్రిములు ముందుగా కాలేయంలోకి ప్రవేశించి అక్కడ వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి.

అసంఖ్యాకంగా వృద్ధి చెందిన తరువాత అక్కడి నుంచి తిరిగి అతడి రక్త ప్రవాహంలోకి ప్రవేశించి అక్కడి ఎర్ర రక్త ణాలను నాశనం చేయడం ప్రారంభి స్తాయి. మలేరియా క్రిమి కాలేయంలో ఉన్న దశలో మలేరియా తాలూకు లక్షణాలేమీ మనిషిలో కని పించవు కానీ, కాలేయం నుంచి రక్త ప్రవా హంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం మొద లెట్టాకా మాత్రం విపరీతమైన జ్వరం, చలి మొదలవుతాయి.

మలేరియాతో బాధపడుతున్న వ్యక్తిని ఆడదోమ కుట్టి రక్తం పీల్చుకుని ఆ తరువాత అది మరొక ఆరోగ్యవంతుడిని కుట్టిందంటే అత డికి కూడా మలేరియా సోకుతుంది. ఈ రకంగా ఆడదోమలు మలేరియా వ్యాప్తికి కారణం అవుతుంటాయి. లక్షణాలు మలేరియా క్రిమి కాలేయం నుంచి రక్తంలోకి ప్రవేశించాకా అక్కడి ఎర్ర రక్తకణాలు చిట్లడం మొదలవుతాయి. సరిగ్గా ఆ సమయంలో అత డిలో 103-104 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ జ్వరంతో వణుకుడు మొదలవుతుంది. రోగికి విపరీతంగా తలనొప్పి ఉండవచ్చు.

వాంతులు మొదలు కావచ్చు. శరీరంలోపలినుంచి వచ్చే చలిని తట్టుకోలేక రోగి దుప్పటి మీద దుప్పటిని కప్పుకోవాలని అనుకుం టాడు. జ్వరం గరిష్ట స్థాయికి చేరుకున్నాకా మాత్రమే అతడిలో చలి తగ్గి పోతుంది. చలి తగ్గిన కొన్నిగంటల తరువాత టెంపరేచర్‌ మళ్లీ మామూలు స్థితికి వచ్చి, చెమటలు పట్టడం ప్రారం భమవు తుంది. నీరసంగా బలహీనంగా ఫీలవు తాడు. జ్వరం తగ్గిన ఒకటినుంచి మూడు రోజుల వరకూ అతడు మామూలుగానే తిరుగుతాడు. తరువాత మళ్లీ చలి, జ్వరం ప్రారంభమవుతాయి.

మలేరియాలో ఉన్న ముఖ్య లక్షణమేమిటంటే, రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారి జ్వరం, చలి మొదలు కావడం. కాలేయం నుంచి మలేరియా క్రిములు రక్త ప్రవా హంలోకి ప్రవేశిస్తున్నప్పుడల్లా జ్వరం, చలి మొదలవుతాయి. రక్త క్షీణత మలేరియా జ్వరం మాటిమాటికీ వస్తుంటే ఆ మనిషిలో ఎర్ర రక్తకణాలు బాగా క్షీణించి, రోగి రక్తహీనతకు గురవుతాడు.

తీవ్రమైన కేసులలో అతడిలని కాలేయం, స్ల్పీన్‌ వాపు చెందుతాయి. నిర్ధారణ సాధారణంగా మలేరియాకు సంబంధించిన లక్ష ణాలైన చలి, జ్వరం వస్తున్నప్పుడు డాక్టర్లు పెద్దగా టెస్టులను చేయించరు. తమ అనుభవం ఆధారంగా చికిత్స చేయడానికి పూనుకుంటారు. ఏ కొద్దిగానైనా అనుమానం వస్తే రక్త పరీక్ష చేయించి దానిని నివృత్తి చేసుకుంటారు. చేతి వేలినుండి ఒకటి రెండు రక్తం బొట్లను తీసి గాజు పలకపై అద్ది అందులోని ఎర్ర రక్త కణాలలో మలేరియా క్రిములేమైనా ఉన్నా యేమో పరీక్షించి చికిత్స చేస్తారు.