మలి వికెట్‌ కోల్పోయిన చెన్నై.. వాట్సన్‌ ఔట్‌

Watson
Watson

జైపూర్‌: ఐపిఎల్‌లో భాగంగా సవాయి మాన్‌సింగ్‌ మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ క్రికెట్‌ జట్లు తలపడుతున్నాయి. కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి, ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఐతే, మొదట బ్యాటింగ్‌ ప్రారంభించిన చెన్నై 105పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా అర్సర్‌ వేసిన బౌలింగ్‌లో వాట్సన్‌ 39 వ్యక్తిగత పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరారు.