మరో 10 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

TRANSFER
TRANSFER

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీల పరంపర కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థాన చలనం కల్పించిన ప్రభుత్వం ఆమర్నాడే శుక్రవారం మరో 10 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ పది మందిలో ఐదుగురిని డిఆర్వోలుగా నియమించగా, ఇద్దరిని ఆర్డీవోలుగా నియమించింది. వీటికి సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం ఆర్‌డిఒగా పనిచేస్తున్న టి పూర్ణచంద్రరావును హైదరాబాద్‌ డిఆర్వోగాను, వెయిటింగ్‌లో ఉన్న పి చంద్రయ్యను సూర్యాపేట్‌ డీఆర్వోగా, బి భిక్షాను కరీంనగర్‌ డిఆర్వోగా, ఎంవి రవీంద్రనాధ్‌ను నల్లగొండ డిఆర్వోగా, ఇబ్రహీంపట్నం ఆర్‌డీఒగా పనిచేస్తున్న కె మధుకర్‌రెడ్డిని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా డిఆర్వోగా, ట్రైనింగ్‌లో ఉన్న ఆర్‌ పాండును అచ్చంపేట్‌ ఆర్‌డీఒగా, సి అమరేదర్‌ను ఇబ్రహీంపట్నం ఆర్‌డిఒగా, శేర్‌లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌ కమ్‌ తహసిల్దార్‌గా ఎం వాసుచంద్రను, సిసిఎల్‌ఎలో అసిస్టెంట్‌ సెక్రటరీగా జి భాస్కరావును బదిలీ చేశారు.