మరో సీటు అదనంగా అడుగుతున్నాం : చాడ

హైదరాబాద్ : సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మంగళవారం ఆయిన మీడియాతో మాట్లాడుతూ సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ జాప్యం చేసిందని, తమకు ఇస్తామన్న మూడు స్థానాలకు అదనంగా మరో సీటు అడుగుతున్నామని చాడ అన్నారు. కాంగ్రెస్ నేతలతో మరోసారి మాట్లాడి (బుధవారం) అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటు విషయంలో ఇంకా జాప్యం చాలా బాధాకరమని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నదే తమ లక్ష్యమని చాడ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు పై తమకు ఒక అవగాహన వచ్చిందని చాడ స్పష్టం చేశారు.