మరో రెండు కొత్త జిల్లాలకు ప్రభుత్వం ఏర్పాట్లు

Telangana
Telangana

హైదరబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 31 జిల్లాలకు తోడు మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ములుగు, నారయణపేట కేంద్రంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్ల నుండి ములుగు, నారాయణపేట్‌ జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది.