మరో యుద్దాన్ని ప్రపంచం భరించలేదు

UN Secretary-General Antonio Guterres
UN Secretary-General Antonio Guterres

ఐరాస: గల్ఫ్‌ ప్రాంతంలో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ వ్యాఖ్యానించారు. ఇరాన్‌ అగ్రశ్రేణి కమాండర్‌ను అమెరికా దళాలు హతమార్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తీవ్రస్థాయికి చేరడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి ఉప అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ మీడియాతో మాట్లాడుతూ గల్ఫ్‌లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రధాన కార్యదర్శి నిరంతరం సంప్రదింపులు జరిపారని, తాజా ఉద్రిక్తతలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అధినేతలు అత్యంత సంయమనం పాటించాల్సిన సమయమిదని ఆయన పేర్కొన్నారన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/