మరో ఫ్రెంచి విప్లవం!

దేశం: ఫ్రాన్స్‌

520

Immanuel Mekran

మరో ఫ్రెంచి విప్లవం!

అనుకొన్నట్లే మేక్రాన్‌ దేశ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠిం చాడు. మొదటిరౌండ్‌ పోలింగ్‌లో ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండోరౌండ్‌ నిర్వహించగా, ఆ విడతలో మేక్రాన్‌ ఘన విజయం సాధించడం విశేషం. ఐరోపా యూనియన్‌ భవిష్యత్‌ ముఖ చిత్రం ఎలా ఉంటుందో చెప్పడానికి అద్దంపట్టిన ఎన్నికకావడంతో కొత్త ఫ్రెంచి అధ్యక్షుడిపై ఇయునేగాక ప్రపంచమంతా ఎన్నో ఆశలు పెట్టు కొంది. మేక్రాన్‌ ఎన్నిక అయి ఉండకపోతే బ్రిటన్‌ మాదిరిగా ఫ్రాన్స్‌ కూడా ఇయు నుండి బయటకు వచ్చేస్తుందనీ, దాని ఫలితంగా యూనియన్‌ మరింత బలహీనపడి ముక్కచెక్కలవ్ఞతుందనీ అధిక సంఖ్యా కులు ఆందోళన చెందారు. అయితే మేక్రాన్‌ ఎన్నికతో అటువంటి అవసరం రాకుండా యూనియన్‌పటిష్టంగా సాగడానికి మార్గం కనిపించింది.

ఏప్రిల్‌ 23వ తేదీన జరిగిన తొలివిడత పోలింగ్‌లో మేక్రాన్‌కు 23.9 శాతం ఓట్లు రాగా, ఆయనకు సవిూప ప్రత్యర్థి అయిన మారిన్‌ లీపెన్‌కు 21.4 శాతం ఓట్లు లభించాయి. మరో ఇద్దరు ప్రత్యర్థులు ఫ్రాంకోయిస్‌ ఫిలాన్‌కు 19.9 శాతం ఓట్లు, మెలిం కన్‌కు 19.6 శాతం ఓట్లు రావడంతో మలివిడత పోలింగ్‌కు రాకుండానే వారిద్దరు వైదొలిగారు. దానితో ‘ఎన్‌మార్చ్‌ పార్టీ నాయకుడైన మేక్రాన్‌, నేషనల్‌ ఫ్రంట్‌ అభ్యర్థి లీపెన్‌ మాత్రమే బరిలో మిగిలారు. గత ఆదివారం (7,మే) జరిగిన మలివిడతలో మేక్రా న్‌కు 66.1 శాతం ఓట్లురాగా లీపెన్‌ 39.9 శాతం వద్దే ఆగిపోయారు.దీనితో అత్యధిక మెజారిటీతోపాటు చరిత్రలో మరో అరుదైన రికార్డు కూడా మేక్రాన్‌ సొంతం చేసుకొన్నారు.

అది- ఇప్పటి దాకా ఫ్రెంచి అధ్యక్షులైన వారిలో అతి పిన్నవయస్కుడు మేక్రాన్‌. తటస్థవాదిగా ముద్రపడిన మేక్రాన్‌ మొదటి నుంచి ఇయుకు అనుకూల వాదిగానే ఉండడంతో కూటమి లోని సమైక్యవాద దేశాలన్నీ ఆయన ఎన్నికవ్వాలనే కాంక్షించాయి. బ్రిటన్‌ తరహాలో ఫ్రాన్స్‌ను ఇయు నుండి బయటకు తెస్తామన్న లీపెన్‌ విజయానికి చాలా దూరంలోనే నిలిచిపోవడంతో అధ్యక్ష ఎన్నిక ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇయులో అనేక పరిణామాలు సంభవించడం ఆరంభించాయి. ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ (39) నాయకత్వంలో ఎన్‌మార్చ్‌ (పురోగామి) పార్టీ ప్రారంభమైంది కూడా ఏడాది క్రితమే. అతి తక్కువ కాలంలో ఆయన నేరుగా దేశాధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించగలిగారంటే తన మధ్యే వాద విధానాల వల్లనే. ఏడాది కాలంలో దాదాపు 70 శాతం ప్రజాదరణ రేటింగ్‌ సాధించింది కూడా ఫ్రెంచి చరిత్రలో మొదటిసారి ఆ యనే. నెపోలియన్‌ తర్వా త అంతటి ‘హీరోదాత్తత కులనేతగా ఏడాది వ్యవధి లోనే ఆయన పేరు సాధిం చుకోగలిగారు. ఉమ్మడి మార్కెట్‌ను కోరుకొనే ఇయు అనుకూల వాదు లందరికి మేక్రాన్‌ ఎన్నిక సంతృప్తిని కలిగించినా, లీపెన్‌ దాదాపు 34 శాతం ఓట్లు సాధించడం ఆందోళనకు గురి చేస్తోంది. మళ్లీ ఎన్నిక జరిగే 2022 నాటికి జాతీయవాద (అతివాద) నేత బలం పుంజు కొంటే ఇయు పరిస్థితులు తారుమారవ్ఞతాయనే ఆందో ళన చాలా మంది నుండి వ్యక్తమవ్ఞతోంది. ఐరోపా ఐక్యత ప్రచారాస్త్రంగా అధ్యక్షపీఠం అధిష్ఠించిన మేక్రాన్‌కు ప్రస్తుతం ఇయు ఎదుర్కొంటున్న సంక్షోభం ఒకపెను సవాలు కాబోతోంది.

దానిని ఎదుర్కొంటూనే ఆయన తన స్థానాన్ని పటిష్టం చేసుకోవలసి ఉంది. ‘మాది కుడి కాదు, ఎడమ కాదు.. మధ్యేమార్గం అని ఎన్నికల నినాదంగా వినిపించిన మేక్రాన్‌ అదే బాటలో సాగినంతకాలం ఇయుకు కొత్త సమస్యలేవీ రావనే భావిస్తున్నారు.గతంలోని హాలండ్‌ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం మినహా రాజకీయ అనుభవం విశేషంగా లేకపోయినప్పటికీ ప్రజలు ఆయనకే పట్టంకట్టారు. ఇక ఆయన తన పార్టీని వచ్చే నెల జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే విధంగా గెలిపించుకోగలిగితే అప్పటి నుంచి ఆయనకు అసలైన విజయయాత్ర మొదలవ్ఞతుందనిపిస్తుంది. ఫ్రెంచి రాజకీయాలలో ఆయన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికాకపోయినా, ‘ఐరోపా ఐక్యత నినాదం విని పించడంతో ప్రజలంతా ఆయనవైపే మొగ్గు చూపారు. గత నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్‌ ఎన్నికైన తర్వాత బ్రిటన్‌లో బ్రెగ్జిట్‌ మద్దతు దారు అయిన థెరెసా మే అధికారంలోకి వచ్చారు.

దానితో ‘ఫ్రెగ్జిట్‌ అంటే ఫ్రాన్స్‌ కూడా ఇయు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమమైందని అంతా భావిం చారు. అయితే మొదట ఆస్ట్రియాలోను, తర్వాత నెద ర్లాండ్స్‌,ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఆ అంచనాలు తారుమార య్యాయి. కార్మిక చట్టాలను సవరిస్తాననీ, ఫ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తాననీ, ఉపాధి అవకాశాలు పెంచుతాననీ ఆ యన ఇచ్చిన హావిూల ప్రభావం ఓటర్లపై విశేషంగానే కనిపించింది. వలస ప్రజల కోసం సరిహద్దులు తెరచి ఉంచడం, స్వేచ్ఛా మార్కెట్‌, ముస్లిం మైనారిటీలకు పూర్తి స్వేచ్ఛ వంటి విధానాలను మేక్రాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. వాటన్నిటిని ఆయన అమలు చేయగలిగితే ముందు ముందు ఒక కొత్త ఫ్రాన్స్‌ ఆవిష్కృతమవ్ఞతుంది.

వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్‌ ఒప్పందాన్ని సమర్థిస్తున్న మేక్రాన్‌ ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న అమెరికా అధ్యక్షునితో ఎలా వ్యవహ రిస్తారనే అంశం ఇప్పుడు అందరిలో చాలా ఆసక్తి కలిగిస్తోంది. హాలండ్‌ నాయకత్వంలోని సోషలిస్టు పార్టీ పార్లమెంటులో బలంగా ఉన్నందున వచ్చే నెల జరిగే జాతీయ అసెంబ్లీ ఎన్నికలు మేక్రాన్‌కు అగ్ని పరీక్షలా పరిణమిస్తాయి. నెలరోజుల్లో ఆయన తన ముద్ర వేటిపై ఎలా వేయగలుగుతారన్నదే ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చగా ఉంది. ఆ ఎన్నికల్లోనూ ఉదా రవాదం ప్రతిబింబిస్తే ఫ్రాన్స్‌ రేఖాచిత్రం మారి పోతుందనిపిస్తుంది.

– ఎ.వి.వి. ప్రసాద్‌