మరో జస్టిస్‌ ఎన్వీ రమణ కూడా తప్పుకున్నారు

Justice N.V. Ramana
Justice N.V. Ramana

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు నియామకంపై దాఖలైన పిటిషన్‌ విచారణ నుండి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గోగొయ్‌,న్యాయమూర్తి జస్టిస్‌ సిక్రి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో న్యాయమూర్తిజస్టిస్‌ రమణతప్పుకున్నారు. అయితే సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు, తాను ఒకే రాష్ట్రానికి చెందిన వ్యక్తులమని, ఆయన కుమార్తె వివాహానికి కూడా తాను హాజరయ్యానని పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. విచారణలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేసును తగిన ధర్మాసనానికి అప్పగించాలని సీజేఐ రంజన్‌ గొగొయ్‌ను జస్టిస్‌ రమణ కోరారు.