మరో ఘనత సాధించిన అంగవైకల్య మహిళ

Arunima ,  MODI
Arunima , MODI
న్యూఢిల్లీ: 2013లో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అంగవైకల్య మహిళగా రికార్డు సృష్టించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత అరునిమ సిన్హా.. మరో ఘనత సాధించింది. అంటార్కిటికాలో అత్యంత ఎత్తైన శిఖరం విన్సన్‌ను అధిరోహించిన మొదటి అంగవైకల్య మహిళగా రికార్డు సాధించింది.‘‘నిరీక్షణ అంతమైంది. సరికొత్త ప్రపంచ రికార్డును మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. విన్సన్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అంగవైకల్య మహిళగా రికార్డు సృష్టించాను. మీ అందరి ప్రార్థనలకు, ఆశీస్సులకు కృతజ్ఞతలు’’ అని అరునిమ ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.కాగా అరునిమకు ప్రధాన మంత్రి మోడీ అభినంధనలు తెలిపారు. ‘‘సరికొత్త ఘనత సాధించిన అరునిమ సిన్హాకు అభినంధనలు. ఆమె ఇండియాకు గర్వకారణం. తన పట్టుదల, కృషితో ఈ విజయాన్ని సాధించింది. అరునిమకు మంచి భవిష్యత్ ఉంది’’ అని ట్విట్టర్‌లో మోడీ రాసుకొచ్చారు. అంతే కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు పలువురు ప్రముఖులు అరునిమను అభినందించారు.