మరోసారి స్తంభించిపోయిన అమెరికా ఖజానా

Donald trump
Donald trump

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వనికి మరోసారి ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. యూఎస్‌ ఫెడరల్‌ వ్యయ బిల్లుకు కాంగ్రెస్‌ ఆమోదం తెలపకపోవడంతో నిధుల జారీకి అనుమతి లేకపోవడంతో అమెరికా ఖజానా మూతపడనుంది. ఇలా అమెరికా ఖజానా మూతపడట ఈసంవత్సరంలో మూడోసారి. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటల నుండి అమెరికా ఖజానా స్తంభించిపోతుంది. దీంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కానున్నారు. బిల్లు ఆమోదం విషయంలో డెమోక్రాట్లు అనుసరిస్తున్న వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అసహనం వ్యక్తంచేశారు.