మరోసారి ప్రోటోకాల్‌ ఉల్లఘించిన మోదీ!

pm modi
pm modi

ఢిల్లీ: ప్రధాని మోదీ మరోసారి ప్రోటోకాల్‌ను ఉల్లఘించి సెక్యూరిటీ సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించారు.
ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకుల్లో తన ప్రసంగం ముగిసిన తర్వాత మోదీ అక్కడే ఉండి జాతీయ
గీతాలను పాడి ఆహూతులను అలరించిన చిన్నారుల మధ్యకు వచ్చి ఆనందంగా వారిని పలకరించి ప్రేమను
కురింపించారు. చిన్నారులు సైతం మోదీతో ఫోటోలు దిగాలన్న ఉత్సాహాన్ని చూపించారు. ఈ క్రమంలో
మోదీ చిన్నారుల మధ్యకు వెళ్లిన వేళ, ఆయన్ను చుట్టిముట్టిన పిల్లలను అదుపు చేసేందుకు సెక్యూరిటీ సిబ్బంది
శ్రమించాల్సి వచ్చింది. కాగా గతంలో కూడా మోదీ పలు సందర్భలలో ప్రోటోకాల్‌ను పక్కన విషయం విధితమే.