మరోసారి ట్రంప్‌-కిమ్‌ల భేటి

TRUMP_KIM
TRUMP_KIM

వాషింగ్టన్‌: ఒకప్పుడు, ట్రంప్‌, కిమ్‌ల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేవి. కాగా వారిద్దరి భేటి ప్రపంచాన్నే ఎంతో ఆసక్తికి గురించేసింది. అయితే తాజాగా ట్రంప్‌, కిమ్‌ మరోసారి భేటి కానున్నారు. ఈసమావేశం కోసం చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం తెలిపింది. ‘ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ నుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఓ లేఖను అందుకున్నారు. అది చాలా సానుకూలంగా సహృద్భావంగా ఉంది. కిమ్‌ చెప్పేవరకు మేం ఆ లేఖన పూర్తిగా విడుదల చేయలేం. ట్రంప్‌తో మరోసారి భేటి అయ్యేందుకు కిమ్‌ ఎదుకుచూస్తున్నారన్నది ఆలేఖ ముఖ్య సారాంశం. అందకు మేం కూడా సానుకూలంగానే ఉన్నాం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. శ్వేతసౌధనం మీడియా కార్యదర్శి శండర్స్‌ తెలిపారు.