మరోసారి ఆలోచించండి !

ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

AP CM Jagan letter to Prime Minister Modi
AP CM Jagan letter to Prime Minister Modi

Amaravati:   విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోడి కి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు.’విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరారు. ప్లాంటును బలోపేతం చేయడానికి మార్గాల్ని అన్వేషించాలని, విశాఖ ఉక్కు ద్వారా సుమారు 20వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారు.

విశాఖ ఉక్కు – ఆంధ్రు హక్కు నినాదం వేదికగా ప్రజల పోరాట ఫలితంగా స్టీల్‌ఫ్యాక్టరీ వచ్చింది. దశాబ్దం కాలంపాటు ప్రజలు పోరాటం చేశారు. నాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002–2015 మధ్య వైజాగ్‌స్టీల్‌ మంచి పనితీరు కనబరిచిందని వివరించారు.

19,700 ఎకరాల విలువైన భూములున్నాయి.ఈ భూముల విలువ దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందన్నారు. ఉత్పత్తి ఖర్చుపెరగడం వల్ల ప్లాంటుకు కష్టాలు వచ్చాయని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు