మరోమారు పాక్‌ కాల్పుల ఉల్లంఘనలు

Pakisthan
Pakisthan

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఫూంచ్‌ సెక్టార్‌ వద్ద భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్‌ కాల్పులకు పాల్పడింది. ఈరోజు ఉదయం 9గంటల సమయంలో చిన్న ఆయుధాలు, మోర్టార్లతో పాక్‌ రేంజర్లు దాడులు చేశారు. పాక్‌ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. నిన్న రాజౌరీ జిల్లాలో సుందర్‌వాణి సెక్టార్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించిన విషయం విదితం.