మరింత సింగారంగా..

CUTE
CUTE
CUTE LADY
CUTE LADY

పండుగల సీజన్‌లో చాలాచోట్ల కొత్త బట్టల షాపులు ప్రారంభమయ్యాయి. ఆఫర్లే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వెయ్యిరూపాయలకు నాలుగు చీరలు, వెయ్యిరూపాయలకు 5 లెగ్గిన్స్‌ ఇలా ప్రకటించేసరికి జనాలు పొలోమని షాపులపై పడుతున్నారు. మార్కెట్‌లో ప్రతీది ఆఫర్‌ అనే సరికి మగువలందరు పరెగెత్తుకొని వెళతారు. ఇక వస్త్రాల విషయానికొస్తే ఒకటికొంటే ఇంకోటి ఉచితం అనడమే తరువాయి ఆ షాపులో సగం వస్త్రాలు అమ్మకమైపోయినట్టే. మరిఅటువంటప్పుడు ఒకచీర కొనండి రెండు చీరలు కట్టండి అంటే మగువలు ఊరుకొంటారా పరిగెత్తుకొని మరీ కొంటారు. ఇది కనిపెట్టిన మన ఫ్యాషన్‌ గురూలు రివర్స్‌బుల్‌ చీరలతో మగువల్ని ఆకర్షితుల్ని చేసేస్తున్నారు. ఈచీరల జోరు చూస్తుంటే వీళ్ల ఆఫర్‌ ఆడవాళ్లకు తెగనచ్చేసిందనే చెప్పాలి! చీర ఉండేది అంతా చేసి ఐదున్నరమీటర్లే గానీ.. ఓసారి పట్టుబుటాలతో, మరోసారి కుందన్‌ మెరుపులతో, ఇంకోసారి చమ్కీచమక్కులతో ఎన్ని రంగురంగుల మెరుపులతో ఎన్ని చిన్నెలు పోతుందో. వయ్యారంగా ఒంటిపేట పమిటలనీ, కాస్త ట్రెండీగా కనిపించాలంటే పల్లూని వెనక నుంచి ముందుకు వేసిన మార్వాడీ పమిటలనీ చీర కొంగుకూ చాలానే సింగారాలున్నాయి.
్జ ఆ ఆందానికి మరింత ఆకర్షణనీ జోడిస్తూ కట్టు చెంగును పమిట చెంగులా పమిట చెంగును కట్టు చెంగులా… ఇలా ఒకే చీరను రెండు రకాలుగా కట్టుకునే వీలు కల్పించేలా రివర్సిబుల్‌ చీరలు మార్కెట్లోకి వస్తున్నాయి, రెండు రకాలుగా కట్టుకుంటే జత చీరల్లా కనిపిస్తాయి.
కాబట్టి ట్విన్‌ శారీస్‌ అనీ వీటిని పిలుస్తున్నారు.జత లెగ్గింగ్‌లూ నాలుగు టాప్‌లూ ఉంటే వాటినే ప్యాంట్లూ టాప్‌లూ మార్చి మార్చి ఒకదానికొకటి విభిన్నంగా కనిపించేలా వేసుకోవచ్చు. చీరకూ ఇలాంటి కొత్తదనాన్ని తీసుకురావడానికే ఈ రివర్సిబుల్‌ శారీస్‌ని రూపొందిస్తున్నారు.
చీరలోని ఏ చివరైనా పమిట చెరుగుగా వచ్చేలా కట్టుకునే వీలుండే ఇవి రెండు మూడు రంగుల కలబోతగా వస్తున్నాయి. జాకెట్టును మాత్రం చీరను ఏవైపు నుంచీ కట్టుకున్నా దానికి మ్యాచయ్యేలా రూపొందిస్తున్నారు.
కొన్ని మోడళ్లలో అయితే ఏ రంగు ఎక్కువగా ఉండే భాగాన్ని పమిటగా వేసుకుంటే దానికి సరిపడే జాకేట్టు వేసుకునేలా రెండు రకాల రవిక ముక్కల్ని వీటితో పాటు ఇస్తున్నారు. కాబట్టి మనం ఒకేచీరను రెండు సార్లు కట్టుకున్నా చూసే వాళ్లకు రెండు వేర్వేరు చీరల్లాగే అనిపిస్తాయి. సిల్కు, జార్జెట, షిపాన్‌ , కాటన్‌ లాంటి చీరలతో పాటు వర్కు, చీరల్లోనూ ఈ తరహా డిజైన్లు మెరుస్తు న్నాయి. మొత్తానికి ఈ రకం చీరల వల్ల చెంగు ఎటూ అని వెతుక్కోవాల్సిన ఇబ్బంది లేదన్నమాట.

CUTE LADY
CUTE LADY


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/