మరణ ధ్రువీకరణపత్ర నమోదుకు ఆధార్‌ లింక్‌

aadhar
aadhar

ఢిల్లీ: మరణ ధ్రువీకరణ పత్రాల నమోదుకు ఆధార్‌ తప్పనిసరిగా ఉండాల్సిందేనంటూ కేంద్రం
స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు బ్యాంక్‌ ఖాతాలు, పాన్‌ నంబర్లు, సంక్షేమ పథకాలు
తదితర వాటికి తప్పనిసరి అయినా ఆధార్‌ కార్డు తాజాగా మరణ ధ్రువీకరణ పత్రానికి
కూడా తప్పనిసరి కానుంది. అక్టోబర్‌ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మరణ
ధ్రువీకరణ నమోదుకు ఆధార్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటన
వెలువరించింది. అయితే జమ్ముకాశ్మీర్‌, మేఘాలయ, అసోం రాష్ట్రాలకు దీని నుంచి
మినహాయింపు కల్పించింది.