మరణాన్ని జయించిన ప్రభువు

Jesus
Jesus

మరణాన్ని జయించిన ప్రభువు

నేడు ‘ఈస్టర్‌ పండుగ. యేసుప్రభువు ‘గుడ్‌ఫ్రైడే నాడు మనకోసం సిలువలో మరణించి, మూడవరోజు అనగా ఆదివారం ఆయన పునరుత్థానమైన రోజును ‘ఈస్టర్‌గా పిలుస్తారు. ‘పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు (యోహాను 11:25,26) యేసుప్రభువే స్వయంగా మార్తతో ఈమాటల్ని అన్నాడు. మనందరి దోషాల నిమిత్తం ప్రభువ్ఞ సిలువలో ఘోరంగా హింసించబడి, అవమానంతో, అర్ధనగ్నంతో, ఉమ్మివేయుంచుకుని మరణించాడు ఆ కరుణామయుడు. మూడవరోజు ప్రభువు మహిమశరీరంతో తిరిగి లేచాడు.

ఈలోకంలో మహనీయులు, పూజ్యులు, ఆదర్శప్రాయులు, సంఘసంస్కర్తలు, మానవతావాదులు ఎందరో దేవతలు, దేవ్ఞళ్లుగా కీర్తించబడుతున్నారు. ప్రజలు వారే తమ దైవంగా భావిస్తూ, పూజిస్తున్నారు. అయితే యేసుప్రభువ్ఞ మరణించి, మూడవరోజున మృత్యుంజయుడిగా లేచినట్లుగా చరిత్ర ఆధారాలు లేవ్ఞ. క్రైస్తవ లోకానికి ఇదే అతిగొప్ప విజయం, నిరీక్షణ. ప్రభువ్ఞ మరణించేందుకు కొన్నివేల సంవత్సరాలకు ముందే ప్రవక్తలు ఆయన మరణం, పునరుత్థానం గురించి ప్రవచించారు. కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభువ్ఞ పసిబాలుడిగా జన్మించాడు. తన జీవితకాలంలో దేనిని ఆశించకుండా, సింపుల్‌గా జీవిస్తూ, చనిపోయినవారిని లేపాడు, రోగులను స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతకార్యాలు చేశాడు. చివరికి ఏ నేరం చేయని ఆయనను తాను దేవ్ఞడినని చెప్పుకుంటున్నాడనే నెపంతో యూదులు, యాజకులు, పరిసయ్యులు, మతపెద్దలు ఏకమై, ఆయనను చంపారు. ‘నేను గొఱె€లకు మంచి కాపరిని, మంచి కాపరి గొఱె€లకొరకు తన ప్రాణము పెట్టును (యోహాను 10:11). మన కాపరి అయిన యేసుప్రభువ్ఞ మనకోసం తన ప్రాణాన్ని పెట్టాడు.

మూడవరోజు ఆయన తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను. అటుపిమ్మట ఐదువందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు (1కొరంథీ 15: 3-6). ఇదేదో కల్పించబడి చెప్పిన విషయాలు కావ్ఞ, చరిత్ర తెలుపుతున్న సత్యం. ప్రభువ్ఞను ఒక్క శిష్యులు మాత్రమే కాదు, ఐదువందలమంది కంటే ఎక్కువగా చూసారు. ప్రభువ్ఞ తమకోసమే మరణించాడు అని విశ్వసించేవారు గుడ్‌ఫ్రైడే పర్వదినాన్ని ఆధారం చేసుకుని, ప్రభువ్ఞను, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆరాధిస్తారు, తద్వారా ఈస్టర్‌ పండుగ ఆనందాన్ని అనుభవించగలరు. యేసుప్రభువ్ఞ మతాన్ని స్థాపించేందుకు రాలేదు కానీ, సత్యమార్గం అనగా పరలోకమార్గాన్ని ఇచ్చేందుకు వచ్చాడు. ఆ మహిమగల రాజ్యంలో మనల్ని ప్రవేశింపచేసేందుకు తనకుతానుగా బలైపోయాడు. ఆ మార్గన్ని గ్రహించి, ప్రభువ్ఞను సొంతరక్షకుడిగా అంగీకరించేందుకు ఈ ఈస్టర్‌ ఒక అవకాశంగా చేసు కుని, ప్రభువ్ఞను విశ్వసిస్తే, అదే గొప్ప ధన్యత

– పి.వాణీపుష్ప