మమతా బెనర్జీ తాలిబన్‌ దీదీ

Kailash Vijayvargiya
Kailash Vijayvargiya

మిడ్నాపూర్‌: పశ్చిమబెంగాల్‌ సిఎం మమతాబెనర్జీకి బిజెపి నేత ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్ వర్గియ హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని మిడ్నాపూర్‌ లో అమిత్‌ షా ర్యాలీ సందర్భంగా జరిగిన దాడి నేపథ్యంలో ఆయన మమతాకు హెచ్చరికలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ చేసిన దాడులతో బీజేపీ కార్యకర్తలు భయపడబోరని, ఈ దాడికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కైలాష్ మమతాబెనర్జీని హెచ్చరించారు. బిజెపి కార్యకర్తలు వచ్చిన వాహనాలను ధ్వంసం చేయడంపై బిజెపి కార్యకర్తలతో నిరసన తెలిపారు. మమతా బెనర్జీని తాలిబన్ దీదీ అంటూ వ్యాఖ్యలు చేశారు.