మన మార్గదర్శులను తలచండి

MASZID
MASZID

మన మార్గదర్శులను తలచండి

జీవితం ఓ ఆట. ఈ జీవితం ముగిసినప్పుడే ఆట ముగుస్తుంది అన్నారు మన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పండితుడు. ఆ జీవితంలో మనపాత్రలను క్రమక్రమంగా జారీ పోతూ ఉంటుంది అన్నాడు భర్తృహరి.

భూమి మీద మనిషి జీవితమంతా యుద్ధమయమే. అడుగడుగునా అనేక సమస్యల్ని ఎదు ర్కొవలసివస్తుంది. సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి అన్నింటా నీవే మొదటి వాడివి కానక్కరలేదు. గొప్పవాడివి కూడా కానక్కరలేదు. సామాన్య మనిషైనా చక్కగా జీవితాన్ని గడప వచ్చు. మనిషి కష్టాలను ఎదుర్కొవడంలో అధైర్యపడిపోకూడదు. మన పూర్వపు ప్రవక్త లు అనేక కష్టాలను ఎదుర్కొని విజయవం తంగా జీవితాఇ్న ఆదర్శవంతంగా దిద్దుకొని మనకు మార్గదర్శకులైనారు.

రక్త సంబంధీకులే మిమ్మల్ని బాధపెడ్తు న్నారా? సొంత అన్నదమ్ముల చేతుల్లోనే మోసపోయిన యూసుఫ్‌ (అలై) గారిని గుర్తు కు తెచ్చుకోండి. సొంత తల్లిదండ్రులే దైవ ధర్మాన్ని అనుసరించడంలో మీకు అడ్డుపడు తున్నారా? విగ్రహారాధనను తిరసరించినందు కు కన్నతండ్రినే మంటలలోకి తోయబడిన ఇబ్రాహీం (అలై)గారిని గుర్తుకు తెచ్చుకోండి. ప్రాపంచిక జీవితంకన్నా పరలోక చింతనకు ప్రాముఖ్యం ఇస్తున్నావని బంధువులు ఎగతాళి చేస్తున్నారా? మన ప్రియప్రవక్త ముహమ్మద్‌(స) కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని గుర్తుకు తెచ్చుకోండి. సమస్యల సుడిగుండంలో చిక్కుకొని బయటికి రాలేకపోతున్నారా? చేపగర్భంలో చిక్కుకున్న యూనుస్‌(అలై) గారిని గుర్తుకు తెచ్చుకోండి.

ఆరోగ్యం క్షీణించి, రోగాల బారిన పడి శరీరం బాధపెడుతోందా? అంతకన్నా దుర్భలమైన స్థితలో విలవిలలాడిన అయ్యూల్‌(అలై) గారిని గుర్తుకుతెచ్చుకోండి. నీలో ఏదైనా శారీరకలోపం ఉందని నీకనిపిస్తోందా? ప్రవక్త మూసా అంతటి వారేనత్తితో తడబడేవారని గుర్తుకు తెచ్చుకోండి. అభాండాలు, అపనిందల పాలవ్ఞతు న్నారని బాధపడుతున్నారా? విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ ఆయిషా(రజి) గారినే లోకం వదలిపెట్ట లేదని గుర్తుకు తెచ్చుకోండి.

ఒంటరితనం మిమ్ము బాధిస్తోందా? ఒంటరిగా భూమిపైకి అడుగుపెట్టిన ఆదం (అలై)గారిని గుర్తుకు తెచ్చుకోండి. జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతోందో అర్థంకాక మనసు విలవిలలాడుతోందా? ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఎంతో పెద్ద ఓడను తయారు చేసిన నూహ్‌(అలై)గారిని గుర్తుకు తెచ్చుకోండి. మనలాంటి వాళ్లు ఏదైనావిపత్తు వచ్చిపడితే ఓ అల్లాహ్‌! మహానుభావ్ఞలనే పరీక్షించాడు అని గుర్తుంచుకోండి.

– షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌