మన్మథుడు. లుక్ లో చాలా కొత్తగా

Nagarjuna
Nagarjuna Akkineni

మన్మథుడు. లుక్ లో చాలా కొత్తగా

అక్కినేని నాగార్జున ఈ రోజు పెద్ద షాకే ఇచ్చాడు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఇవాళ తన కొత్త సినిమా ‘రాజు గారి గది-2’ ట్రైలర్ లాంచ్ చేసిన నాగ్.. ఆ కార్యక్రమానికి సరికొత్తగా తయారై వచ్చాడు. ఆశ్చర్యకరంగా నాగ్ మీసం తీసేసి ఈ వేడుకకు వచ్చాడు. ఈ లుక్ లో చాలా కొత్తగా కనిపించాడు నాగ్.ఊరికే మామూలుగా మీసం తీశాడా.. లేక ఏదైనా సినిమా కోసం ఇలా తయారయ్యాడా అన్నది తెలియట్లేదు. నాగార్జునకు ఇమీడియట్ కమిట్మెంట్లయితే ఏవీ లేవు.  ప్రస్తుతానికి ఆయన ఒప్పుకున్నది ‘శమంతకమణి’ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో నానితో కలిసి చేయబోయే మల్టీస్టారర్ మాత్రమే.

ఈ సినిమా ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా పూర్తి స్క్రిప్టు తయారవ్వలేదు. నాని కూడా ఖాళీ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి నాగ్ సరదాగా మీసం తీశాడేమో. ఏఎన్నార్ జయంతి రోజు నాగ్ ఇలా తయారవడంతో తండ్రికి నివాళిగా ఇలా చేసి ఉండొచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఎందుకు చేశాడో ఏమో కానీ.. నాగ్ కు ఈ లుక్ అయితే కొత్తగా అనిపిస్తోంది. మీసం తీయడంతో కొంచెం వయసు తగ్గి కనిపించాడు నవ మన్మథుడు.