మనుషుల్ని తినే పులులం కాదు!

supreem court
supreem court

ఎపి మైనింగ్‌ కేసులో బెంచ్‌ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు అంటే మనుషులను తినే పులిగా భావించకూడదని, సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నంతమాత్రాన రాష్ట్రాలు ఎందుకు భయపడాలని సుప్రీంకోర్టు చురకలు వేసింది. మేమేమీ పులులు వంటి వాళ్లం కాదని, మేం మనుషులను తినే పులులు లాంటి వారం కాదని, రాష్ట్రాలు భయపడాల్సిన పనిలేదని, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, దీపక్‌గుప్తాలతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యలుచేసింద.ఇ ఒక ప్రైవేటుసంస్థకోసం సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహ్‌తగి హాజరైన కేసులో సుప్రీం బెంచ్‌ ఈ వ్యాఖ్యలుచేసింది. ఆంధ్ర్రప్రదేశ్‌లో అక్రమమైనింగ్‌ జోరుగా సాగుతోందని, ఈ పిటిషన్‌ సారాంశం. అందులోనూ ఈ ప్రైవేటు కంపెనీపైనే ఈ పిటిషన్‌ దాఖలయింది. ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం తరపున హాజరైన కౌన్సెల్‌ ఇటీవల రా్ట ప్రభుత్వం మైనింగ్‌ కార్యకలాపాలను సస్పెండ్‌చేసిన ఉత్తర్వులను సుప్రీంకు నివేదించారు. ట్రైమెక్స్‌గ్రూప్‌పై ఈ నిషేధం విదించిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు అందచేసింది. అయితే ఈకేసు అక్రమమైనింగ్‌కు సంబంధించినది కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకోవడం కంపెనీకి నష్టమని వాదించారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు విచారిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయంఎలా తీసుకుంటుందని వాదించారు. న్యాయవాదిప్రశాంత్‌భూషణ్‌ పిటిషనర్‌, సీనియర్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ తరపున హాజరయ్యారు. ఆయన తన వాదనల్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం లైసెన్సు మాత్రమే రద్దుచేసిందని, ప్రభుత్వం లైసెన్సురద్దుచేసి అక్రమమైనింగ్‌ సొమ్మును కంపెనీనుంచి రికవరీచేయవచ్చని వాదించారు. ఈ పిటిషన్‌ను కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిపెంచేందుకు దాఖలైన పిటిషన్‌ అని వాదించారు. ఈ మైనింగ్‌ అక్రమమని చెప్పేందుకు ఎలాంటికేసులు లేవని, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్‌చేయవచ్చని రోహతగి వాదించారు. ఒకరిద్దరు కుమ్మక్కయినంతమాత్రాన రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయతలో ఉందని భావించరాదని సుప్రీం అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదావేసింది. గత జులై తొమ్మిదవ తేదీన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాల వివరణలను కోరింది. ఇందుకు కోర్టు పర్యవేక్షణలోని సిట్‌ లేదా సిబిఐ దర్యాప్తు జరిపించాలని, అక్రమమైనింగ్‌కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా కార్యకలాపాలు సాగిస్తోందంటూ పిటిషన్‌ దాఖలయింది. కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శర్మ తన అభ్యర్ధనలో తన వాదనను వినిపిస్తూ కంపెనీ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ కార్యకలాపాల్లో భాగస్వామి అయిందని, మైనింగ్‌, వివిధ ఖణిజవనరుల ఎగుమతులు మోనజైట్‌ వంటి ఖనిజాలను ఎగుమతిచేస్తోందని, అణు విద్యుత్‌ చట్టం 1962 నిబంధనలను ఉల్లంఘిస్తోందని వాదించారు. ఈ అక్రమ మైనింగ్‌వల్ల అక్కడి వాతావరనం దెబ్బతింటున్నదని, చెట్లపెంపకానికిసైతం విఘాతం కలుగుతోందని వాదించారు. ఈగ్రూప్‌ మైనింగ్‌ లైసెన్సును రద్దుచేసి ఆప్రాంతంలోకంపెనీ కార్యకలాపాలపై దర్యాప్తుజరిపించాలని కోరారు. అంతేకాకుండా కంపెనీనుంచి అక్రమంగా సంపాదించిన సొమ్మును మొత్తం రికవరీచేయాలని డిమాండ్‌చేసింది. కంపెనీపై 1957 ఖనిజాలు, ఖనిజవనరుల అభివృద్ధిక్రమబద్దీకరణ చట్టంపరిధిలో చర్యలు తీసుకోవాలని కోరారు. రికవరీచేసిన సొమ్మును వాతావరణం మెరుగుపరిచేందుకు వినియోగించాలని తన పిటిషన్‌లో అభ్యర్ధించారు.