మనీష్‌గౌడ్‌ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: బీన్‌రెడ్డి నగర్‌ కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న కుమారుడు మనీష్‌గౌడ్‌ తన అనుచరులతో
కలిసి కడ్తాల్‌ టోల్‌ ప్లాజా సిబ్బందిపై దాడిచేసిన ఘటనను మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు.
ఈ దాడి విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్‌కు ఒక వ్యక్తి ట్వీట్‌ చేశాడు. దీనికి వెంటనే స్పందించిన కేటీఆర్‌
ఐపీసీ సెక్షన్‌ 307 కింద పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారని… ఈ ఘటనకు బాధ్యులైనా
ఆరుగురు నిందితులు కస్టడీలో ఉన్నారని, వారిని రిమాండ్‌కు తరలిస్తున్నారని ఆయన తెలిపారు. ఇదిలా
ఉండగా మనీష్‌ గౌడ్‌ మరో ఐదుగురుస్నేహితులతో కలిసి శ్రీశైలం హైవే పైకి వెళ్లాడు. ఈ క్రమంలో కడ్తాల్‌
టోల్‌ ప్లాజా వద్ద వీఐపీ మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో
ఆగ్రహానికి గురైన వారు సిబ్బందిపై దాడి చేయగా రాజేశ్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.