మనిషి కుజుడిపై కుడికాలు మోపేదెన్నడో?

IMG
IMG

మనిషి కుజుడిపై కుడికాలు మోపేదెన్నడో?

ఈయేడాది కుజుడు భూమికి దగ్గరగా వస్తాడు
దూరంతగ్గినా.. ఆస్ట్రోనాట్స్‌ నాట్‌ రెడీ!
మళ్లీ 15యేళ్ల తర్వాతే అవకాశం

అంగారకుడి మీద కాలుమోపాలని మానవ్ఞడు ఎంత ఉవ్విళూరుతున్నాడో అంత అలస్యమవ్ఞతోంది. ఈ ఏడాదిలో భూమి-కుజుడు వారి వారి కక్షల భ్రమణంలో భాగంగా బాగా దగ్గరగా వస్తారట. ఆ దగ్గర పాయింట్‌నుండి గనక రాకెట్‌ను ఉపగ్రహన్ని ప్రయోగిస్తే కొంచెం తొందరగా అరుణ గ్రహానికి చేరచ్చుట. కానీ ఆలోపులో వందలాది ఆZసోనాట్స్‌కు ఇచ్చే కఠిన శిక్షణ పూర్తి అవదుట. ఇలాంటి అవకాశం మళ్లీ 15 తర్వాతే అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏంటి సమస్యలు అంటారా? ఒకటి ఆర్థికభారం.

రెండవది సుదీర్ఘ ప్రయాణంలో ఆZసోనాట్స్‌కు బోర్‌ కొడుతుందట. ఇక మూడవది రేడియేషన్‌. ఇప్పుడున్న రాకెట్‌ టెక్నాలజీతో మార్స్‌పైకి మనిషిని పంపటానికి చాలా ఖర్చు అవ్ఞతుంది. ఖర్ఛు తగ్గాలంటే కొత్త టెక్నాటజీని, కొత్త మెటారియల్‌ను వాడాలి అంటున్నారు. ఆదిశగా పరిశోధిస్తున్నారు. 35 మిలియన్ల మైళ్లు ప్రయాణించి కుజుడుని చేరాలంటే సుమారు 250రోజులు పడుతుంది.

అన్నిరోజుల ఒంటరి ప్రయాణంలో మనిషి విసిగిపోయి ఏమాలోచించాలో తెలియని స్థితికి చేరతాడట. అంతేకాదు దారిలో సూర్య కిరణాలు, కాస్మిక్‌ కిరణాల వల్ల అధిక రేడియేషన్‌కు గురై గుండె జబ్బులు, డిప్రెషన్‌, గుడ్డితనం.. ఇలా ఆరోగ్యం ఘోరంగా తయారవ్ఞతుందట. ఇన్నింటికి అధిగమిస్తే గానీ మనిషి మార్స్‌ను చేరలేడు. మార్స్‌కు చేరటానికే గగనం అవ్ఞతుంటే అక్కడి వెళ్లి ఇళ్లూ వాకిళ్లూ కట్టి వాతావరణాన్ని మనిషికి అనుకూలంగా మార్చాలంటే ఇంకెంత ఖర్ఛు అవ్ఞతుందో లెక్కే లేదంటున్నారు. ఇది ఏ ఒక్క దేశం వల్లో సంస్థ వల్లో అయ్యేదికాదు.. ప్రపంచ దేశాలన్నీ ఓ చెయ్యి వెయ్యాల్సిందే అని అంటున్నారు శాస్త్రవేత్తలు.