మనసులు గెలిచిన సెనెగల్‌ ఫ్యాన్స్‌

FANS
FANS

మనసులు గెలిచిన సెనెగల్‌ ఫ్యాన్స్‌

మాస్కో: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్‌ 2018 ఫుట్‌బాల్‌ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందే మ్యాచ్‌ సమయంలో జట్లుగా విడిపోయి స్టేడి యంలో గొడవలు చేసే హోలిగన్స్‌ గురించి వార్తలు వచ్చాయి. దీనికి తోడు గొడవల కోసమే రష్యాలో కొంతమంది వీరాభిమానులు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలియడంతో ఫుట్‌బాల్‌ అభిమా నులు ఆందోళన చెందారు. కానీ…తాజాగా సెనెగల్‌ అభిమానులు మ్యాచ్‌అనంతరం స్టేడియాన్ని శుభ్రం చేసి అందరి మనసులు గెలిచారు. పోలాండ్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సెనెగల్‌ జట్టు2-1 తేడాతో ఘన విజయాన్ని అందు కుంది. అప్పటివరకు తమజట్టుని ప్రోత్సహించిన అభిమా నులు…అనంతరం తాము కూర్చున్న గ్యాలరీలను శుభ్రంచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇప్పటి వరకు స్టేడియంలోఫుట్‌బాల్‌ అభిమానులు గొడవనే చూసిన అందరూ…సెనెగల్‌ ఫ్యాన్స్‌ చూపిన చొర వకి ఫిదాఅయిపోయారు. సోషల్‌ మీడియాలో… వారిని అభినందిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు.