మనసుకు నచ్చే పాట

MANASUKU NACHINDI
MANASUKU NACHINDI

మనసుకు నచ్చే పాట

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సోదరి ముంజుల ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా ‘మనుసుకు నచ్చింది.. సందీప్‌కిషన్‌, అమైరా దస్తూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. త్రిదాచౌదరి మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది.. కొన్ని నెలల క్రితం స్టార్టయిన ఈచిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తికావచ్చింది.. ఫుల్‌క్లారిటీతో మొదటి సినిమానే చాలెంజ్‌గీ తీస్తున్నారు దర్శకురాలు మంజుల

అయితే కొన్ని నెలల క్రితం సినిమా టీజర్‌ని రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.. సినిమా ఫస్ట్‌లుక్‌లోనే ఓ వర్గం ప్రేక్షకుల్లో చిత్రం యూనిట్‌: అంచనాలను రేపింది.. అయితే మళ్లీ మరొక స్పెషల్‌ సాంగ్‌ ప్రొమోని రిలీజ్‌ చేసి మరింత క్రేజ్‌ని అందుకుంటోందీ యూనిట్‌.. ఫుల్‌ ఎమోషనల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా మంజుల ఈ కథను తెరకెక్కించారు.. తాజాగా రిలీజ్‌ చేసిన సాంగ్‌ విషయానికొస్తే.. ఎంత స్వీట్‌గా ఉందో చూడటానికి కూడా అంతే మాధుర్యంగా ఉంది. చూస్తుంటే సాంగ్‌ ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుందని అని అన్పిస్తోందని అంటున్నారు చూసినవాళ్లు