మనలో అహాన్ని తొలగించాలి

MASZID
MASZID

మనలో అహాన్ని తొలగించాలి

ఈ ప్రపంచంలోని సర్వజీవరాసులను పెంచేవాడూ, పోషించేవాడూ, నిర్మూలించేవాడూ దైవమే. ఆయన సృష్టికర్త. ఆయన సర్వ సంపన్నుడు. ఆయన చర్యలు మనకు అర్థం కాక జీవితంలో మనకున్న అవసరాలను తీర్చే వాడూ ఆయనే. వరాలు ప్రసాదించేవాడూ ఆయనే. వర్షపు నీటిబొట్ల వంటి లెక్కలేని అదృష్టాలను ప్రసాదించేవాడూ ఆయనే. ”ప్రజ లారా! మీ మీ వాస్తవ జీవితాలను పరిశీలించు కోండి. కనీసం కృతజ్ఞతగానైనా తలచుకోం అని అల్లాహ్‌ ప్రజలను హెచ్చరిస్తున్నాడు. అందుకు దైవదాసుడు ”ఓ దేవా! నేను నీ దాసుడను. నీ దాసునిగానే ఉండటానికి ఇష్టపడతాను. ఇలా ఉండటమే నా ధర్మం. మన్ను కాళ్ళ క్రింద ఉండటానికే ఇష్టపడుతుం ది.

క్రింద ఉన్న ఈ మన్నే తలపైన పడితే దాన్ని దులిపేస్తాం. శుభ్రపరుస్తాం. ఎంతకాలం వరకు మట్టి కింద ఉంటుందో అంతవరకు ఆ మట్టికి విలువ ఉంటుంది. పైకిపోతే తొలగి స్తాం అని దాసుడు అంటున్నాడు. నీలోని ‘నేను అనే దాన్ని తీసెయ్యి. ఉదాహరణకు ఇది నేను చేశాను. అది నేను చేశాను. అని ప్రతీదీ నేనే చేశాను అని చెప్పుకోవటం గర్వం క్రిందికి వస్తుంది. దేవ్ఞడంటున్నాడు-నీలోని ‘నేనును తుడిపెయ్యకపోతే నేనే ఆ ‘నేనును తుడిపేస్తాను అని అన్నాడు. నేను అనేది గర్వానికి మూలం అందువలన ‘నేనును తుడిచెయ్యాలి. ఈవిధంగా నేనును తుడిచెయ్యడమే ”ఇంద్రియ నిగ్రహం అంటారు. ఇంద్రియనిగ్రహానికి పునాది- తనలోని కోర్కెలను తుడిచెయ్యడం.

తనలోని గర్వాన్ని తుడిచెయ్యటం. ఈ నేను అనే గర్వాన్ని అణచుకోవటం అనేది మన పూర్వులైన మహాప్రవక్త(స) ఆయన అనుచరులైన సిద్థీఖె అక్బర్‌ కాలం నాటి నుండియే మనకు సంక్రమిం చింది. దైవప్రవక్త(స) తన అనారోగ్య పరిస్థితిలో సిరియా, రోమన్ల నుండి పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించడానికి 17ఏళ్ల నవ యువకుడైన ఉసామా బిన్‌ జైద్‌ (రజి) నాయకత్వంలో ఓ భారీసైన్యాన్ని పంపాలని నిర్ణయిం చారు. సైన్యంబయలుదేరింది.యువ సేనానిఅశ్వారూఢుడై నడవసాగాడు. (ఖలీఫా ప్రజలచేత ఎన్ను కోబడిన నాయకుడు)అబూబక్ర్‌ అతని గుర్రం ప్రక్కనే పాదచారియై నడవసాగాడు. యువసేనాని సిగ్గుపడిపోతూ, ”మీరై నా మరో గుర్రం ఎక్కండి లేదా నన్నయినా గుర్రం దిగి నడువనీ యండిఅని విన్నవించు కున్నాడు. ఖలీఫాతో కాని ఖలీఫా ఈ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరి స్తూ ”నేను గుర్రం ఎక్కను. నీవ్ఞ గుర్రం దిగవన సరమూ లేదు. దైవమార్గంలో కాస్తం త దూరం కాలినడ కన నడిస్తే నాకొ చ్చే నష్టం ఏమిటి?అని అన్నారు హజ్రత్‌ అబూ బక్ర్‌ (రజి).ఈ అపూర్వ దృశ్యం చూసి సమతా సౌభాగ్యం తొణకిసలాడే ఈ మాటలు విన్న సైనికులం దరూ ఆశ్చర్యచకితులయ్యారు. వారిలో కొందరి హృదయాల్లో ఇంకా మిగిలి ఉన్న జాత్యహంకారం, వయోవివక్షతలు పూర్తిగాఅంతమై విధేయత, సమతా భావాలు చోటు చేసుకున్నాయి. దేవ్ఞడుచెప్పినట్లు నీలోని ‘నేను ను తీసెయ్యి అన్నట్లుగా -సేనాపతి గుర్రంమీద రాజు గుర్రంప్రక్కనే పాదచారి అయిపోవడం చూచిన సైన్యానికి కనువిందు కలిగింది.

– షేఖ్‌ అబ్దుల్‌ హఖ్‌