మనది అత్యంత స్వచ్ఛరాష్ట్రం

AP CM BABU
స్వచ్ఛ ఆంధ్ర మిషన్‌ వాహనాలను ప్రారంభించిన సిఎం చంద్రబాబు

మనది అత్యంత స్వచ్ఛరాష్ట్రం

5నెలల్లో 20లక్షల మరుగుదొడ్లు నిర్మాణం
అన్ని గ్రామాల్లో ఎల్‌ఇడి విద్యుత్‌ దీపాలు
పరిశుభ్రత, హరిత, సుందర నిర్మాణమే ఎపి లక్ష్యం

వెలగపూడి సచివాలయం: ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యంత స్వచ్ఛ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. నగరాలు,మున్సిపాలిటీలలో యాంత్రీకరణ పద్ధతిలో శుభ్రం చేసేందుకు ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర మిషన్‌ వాహనాలను వెలగపూడి సచివాల యంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమాలు ఎపిలో చేస్తు న్నామని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్‌లో కూడా మనదే మొదటిసారి అవుతుందని అన్నారు. అదే విధంగా పట్టణాల్లో వీధి దీపాల నుంచి కొత్తగా కొన్ని మిషన్స్‌ కూడా తెప్పించి నట్లు చెప్పారు.
ఎపి అర్బన్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ద్వారా విశాఖపట్నం, విజయవాడ,తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్లలో మూడు ట్రీ మెయిన్టెన్స్‌ ఫ్లాట్‌ ఫారం యంత్రాలను అందుబాటులో ఉంచడం జరుగుతోంద న్నారు. చెట్లు ప్రూనింగ్‌ కూడా ఆటోమేటిక్‌ చేయడానికి, ఏ విధంగా చేస్తే బాగుంటుందో, డిఫరెంట్‌ సైజెస్‌లో గానీ, ఏ షేప్‌ కావాలంటే ఆ షేప్‌లో ప్రూనింగ్‌ చేయడం గాని, మామూలుగా చెట్టు క్రూడ్‌గా కొట్టేయడం కాకుండా ప్రూన్‌ చేస్తే, ఎప్పుడన్నా విండ్స్‌ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటాయని చంద్రబాబు చెప్పారు.