మధ్యాహ్నం 3 గంటల వరకు 56.17 శాతం పోలింగ్‌

polling booth
polling booth

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 56.17 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో 38.68 శాతం పోలింగ్‌ నమోదైంది. 13 సమస్యాత్మక నియోజకవార్గాల్లో నాలుగగంటలకే పోలింగ్‌ ముగిసింది. వాటి మినహా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ సమయం వరకు ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు.