మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా కమల్‌నాధ్‌

Kamalnath
Kamalnath

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయుడు కమల్‌నాధ్‌ను మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా హైకమాండ్‌నియమించింది. ఇప్పటివరకూ పనిచేసిన అరుణ్‌యాదవ్‌ స్థానంలో ఆయన ఎంపి అధినేతగా పనిచేస్తారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో పార్టీ చీఫ్‌ విప్‌ జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ ప్రచారకమిటీ అధిపతిగా నియమించారు. నలుగురు వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు బాలబచ్చన్‌, రామ్‌నివాస్‌రావత్‌, జీతుపట్వారి, సురేందర్‌చౌదరిలను నియమించి కమల్‌నాధ్‌కు సహాయసహకారాలిస్తారని పార్టీ వెల్లడించింది. అలాగేగోవాపార్టీ ఛీఫ్‌గా గిరీష్‌చోదంకర్‌నునియమించారు.ప్రస్తుతం ఉన్న శాంతారామ్‌నాయక్‌ గతనెలలోనే తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో గిరీష్‌ చందంకర్‌ను నియమించారు.మరికొన్ని నెలల్లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్‌పార్టీ ప్రస్తుతం అధికారంలోఉన్న బిజెపినుంచి తిరిగి పాలనపగ్గాలుచేపట్టే లక్ష్యంతో పార్టీపరంగా కీలకపదవుల్లో మార్పులుచేసింది. ఎన్నికలకుసంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరన్నది పార్టీ ప్రకటించనప్పటికీ రంగంలో కమల్‌నాధ్‌, జ్యోతిరాదిత్యసింధియా ఇద్దరూ ఉంటారని పార్టీ నాయకుడు ఒకరు వెల్లడించారు.