మద్యపానాన్ని నిషేధించాలి

ప్రజావాక్కు
                  మద్యపానాన్ని నిషేధించాలి

DRINKING ALCHOHOL
DRINKING ALCHOHOL

మద్యపానాన్ని నిషేధించాలి
ఆచరణ సాధ్యంకాని హామీలు, వాగ్దానాలతో ఎన్నికల ప్రణాళి కలు రూపొందించడం మన పార్టీలకు ఆనవాయితీ అయింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత పథకాల హామీలతో ఊదరగొట్టిస్తూ వారిని ప్రలోభాపరుచుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి సల్పుతున్న సందర్భంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలు మిజోరం రాష్ట్రంలో అత్యంత కీల కమైన మద్యనిషేధం అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చడం ఆసక్తికర పరిణామం.అక్రమవలసలు, వెనుకబాటుతనం, నిరు ద్యోగం విజృంభిస్తున్న అన్ని పార్టీలు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తామని వాగ్దానం చేయడం ఒక నూతన అధ్యయానికి నాంది పలుకుతోంది. ఇప్పటికే కేరళ, బీహార్‌ రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు చేస్తూ దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయి.
-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ఇవిఎంలపై చర్చ అవసరంలేదు
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఖంగుతిన్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆడలేక మద్దెల ఓడిన సామెతను గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో మహాకూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్‌ పార్టీ కేవలం 18 సీట్లు సాధించి చతికిల పడింది. ఓటమికి కారణాలు వెతుకుతూ ఈవీఎమ్‌లపై అనుమానాలున్నాయని ప్రకటించడం హాస్యాస్పదం. తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ నాయ కత్వానికి, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్‌ను రెండోసారి అధికారంలోకి తెచ్చారు. ప్రజాతీర్పు ను టిఆర్‌ఎస్‌ ఘనవిజయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ పెద్దలు ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయంటూ,వీవీప్యాట్‌లోని చీటీ లను లెక్కించాలంటూ పసలేని వాదనలు తీసుకొస్తున్నారు.
-జి.అశోక్‌,గోదూర్‌,జగిత్యాలజిల్లా

స్వచ్ఛభారత్‌ విద్యాకోర్సులు
కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌,స్వచ్ఛ సర్వేక్షణ్‌ పథకా లు గత నాలుగేళ్లలో మిశ్రమ ఫలితాలు ఇచ్చాయన్న జాతీ య గ్రామీణ సంస్థల మండలి నివేదిక నేపథ్యంలో ఈ అంశంలో ఒక ప్రత్యేక కోర్సును తయారు చేసి ప్రవేశపె ట్టింది.అయిదవ తరగతి నుండి పిజి వరకు ప్రతీ కోర్సు లలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టింది. పని విద్యలో భాగంగా పిల్లలకు స్వచ్ఛభారత్‌ పనులుఎలా చేయించాలనే అం శంపై ఒక శాస్త్రీయ అధ్యయనాన్ని ఉపాధ్యాయ విద్యలో ప్రవేశపెట్టడం వంటిచర్యలు స్వచ్ఛభారత్‌కు ఎంతో ఊతం ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
-కె.రామకృష్ణ, హైదరాబాద్‌

మత్తులో యువత మాదకద్రవ్యాలు
అతిపెద్ద సమస్యగా పరిణమించాయి. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తా ల్సిన యువత జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకం గా మానసికంగానిర్వీర్యమైపోతున్నారు. దుర్వ్యసనాల బారిన పడుతూ యుక్తవయస్సులోనే అనారోగ్యానికి గురవ్ఞతున్నారు. శరీర అంతర్భాగంతూట్లు తూట్లుగా మారిపోవడంతో జీవచ్ఛవా ల్లా జీవిస్తున్నారు. రోజుల తరబడి మత్తులో ముంచెత్తే ఈ మహమ్మారి, యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. కళాశాళల్లో చదివే విద్యార్థుల్లో కూడా చాలా మంది ఈ అలవాటుకు బాని సలవ్ఞతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులుజాగ్రత్తలు తీసు కోకపోతే వారి భవిష్యత్తు చేయిదాటే ప్రమాదం ఉంది.
-వ్ఞలాపు బాలకేశవ్ఞలు, గిద్దలూరు, ప్రకాశంజిల్లా

గిట్టుబాటు ధర ముఖ్యం
2022 సంవత్సరానికి స్వతంత్ర భారతానికి 75ఏళ్ల వయస్సు వస్తుంది. అందుకనే అప్పటికి సాధించాల్సిన అభివృద్ధి వ్యూ హాన్ని నీతి ఆయోగ్‌ నవభారత్‌ 75వ్యూహపత్రం పేరుతో విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో వ్యూహాల్ని మాత్రమే చూస్తే ఓహో అనేలా ఉన్నాయి. అసలు వృద్ధికోసం ప్రణా ళికలు, వ్యూహాలు రచించుకోవడం తప్పలేదు. ఆ ఉద్దేశ్యంతోనే పనిచేస్తున్న ప్రణాళికా సంఘాన్ని చాపచుట్టి ఎన్డీయే ప్రభుత్వం నీతి ఆయోగ్‌ని తీసుకువచ్చింది. ఇక ఇప్పటి వ్యూహపత్రం గురించి మాట్లాడితే రైతు ఆదాయం రెట్టింపు చేస్తారట మరో మూడు, నాలుగేళ్లలో. ఇప్పటి స్థితి కొనసాగితే 750 కిలోల ఉల్లి అమ్మి 1,500 సంపాదించిన రైతు మూడువేల రూపా యలు సంపాదిస్తాడన్న మాట.రైతుకు గిట్టుబాటు ధర కల్పించే సంస్కరణలు చేయాలి.
-డా.డి.వి.జి.శంకరరావ్ఞ, పార్వతీపురం

అవకాశవాద చర్యలు
ప్రస్తుతం తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలవేళ జంప్‌ జలా నీల రాజకీయ అవకాశవాద చర్యలు బాగా ఎక్కువయ్యా యి. అనుకున్న పార్టీలు టిక్కెట్లు ఇవ్వకపోతే మరుక్షణం యూటర్న్‌ తీసుకొని, నమ్ముకున్న పార్టీల సిద్ధాతాలను నాట్టేట ముంచి పార్టీలు మార్చేసి పాత పార్టీలను తిట్టడం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో మాతృపార్టీకి వ్యతిరే కంగా రెబెల్స్‌ కింద నిలబడుతున్నారు.పార్టీ టిక్కెట్‌ లభిం చడమే లక్ష్యంగా, స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసే ఈ నేతలకు ప్రజాసంక్షేమం అంటే అసలు పట్టదు.
– సి. ప్రతాప్‌, శ్రీకాకుళం