మదిదోచే టాటూలు

Tatoo444
tatoo design

మదిదోచే టాటూలు

పాశ్చాత్య పోకడలను అవలీలగా మనదేశానికి దిగుమతి చేసిన టాటూలు మన పచ్చబొట్లు లాంటివే. వీటికి కూడా రంగులు అద్దుకోవచ్చు. ఒకప్పుడు నల్లరంగుకే పరిమితమయిన టాటూలకు రంగులద్దుకుంటే ఎంత అందంగా ఉంటాయో కదా. మనిషికి లేని అందాన్ని కొట్టొచ్చినట్లు తెచ్చేవే టాటూలు. ఉన్నట్టుండి చూస్తే ఇదేం ‘వేలం వెర్రి అనుకొంటాం. కాని తరచి తరచి చూస్తే టాటూలు ఎంత కళాత్మక చిత్రాలలో పొందుపరచుతారో అర్థమవ్ఞతుంది. మగాళ్లయితే అమ్మాయిల బొమ్మలు, ప్రేమ పదాలతో టాటూలు వేయించుకుంటారనుకొంటాం. మరి అమ్మాయిలు సీతాకోకచిలుకో, పువ్ఞ్వనో, పండ్లనో, ప్రేమికులనో టాటూలుగా వేయించుకుంటే ‘ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వంటూ మగాళ్లు ఎగిరి గంతేస్తారు కదూ! పాశ్చాత్య వనితలైతే తమ వీపంతా కప్పి ఉండేట్లు ఏమాత్రం అసభ్యంగా ఉండకుండా ఏవో టాటూలు గీయించుకుంటున్నారు.