మత్య్స సోసైటీ అధ్యక్ష ఎన్నికల్లో తెదేపా విజయం!

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణప సముద్రం సరస్సు మత్య్స
సోసైటీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాకిస్తూ తెదేపా అధ్యక్ష పదవిని గెలుచుకుంది.
కాగా అధ్యక్ష పదవిని తెదేపా వరుసగా మూడోసారి గెలుపొందింది. జిల్లా తెదేపా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు
సొంత మండలం కావడంతో ఇక్కడ తెదేపా అధిపత్యం కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు తెరాస
సర్వశక్తులు ఒడ్డినప్పటికి ప్రయోజనం లేకపోయింది.