‘మత్తు’తో పొంచి ఉన్న ముప్పు

drugs
drugs

‘మత్తు’తో పొంచి ఉన్న ముప్పు

పదేపదే పట్టుబడుతున్నా, జైళ్లకు వెళ్లి శిక్ష లు అనుభవిస్తున్నా డ్రగ్స్‌ వ్యాపారాన్ని వదులుకోవడానికి సరఫరాదారులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. పోలీసులు, చట్టాలు, కేసు లు తమను ఏమీ చేయలేవనే ధీమాతో ఈ మత్తు వ్యాపా రాన్ని అంతకంతకు విస్తరిస్తున్నట్లు కన్పిస్తున్నది. హైదరా బాద్‌లోతాజాగా ఆదివారం మత్తుపదార్థాలు సరఫరా చేస్తు న్న ఇద్దరు నైజీరియన్లతోపాటు ముంబైకి చెందిన మరో యువతిని కూడా పోలీసులు పట్టుకున్నారు.

లక్షలాది రూపా యల విలువైన కొకైన్‌ వారి వద్ద నుండి స్వాధీనం చేసుకు న్నారు. ఇది మొదటిసారి కాదు. చివరిది కూడా కాదు. ఇలా ఎన్నోసార్లు ఎంతోమంది నైజీరియన్లు పట్టుబడడం కోట్లాది రూపాయల విలువైన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం, కేసులు పెట్టి జైళ్లకు పంపడం, తిరిగి వారు బయటకు వచ్చి అదే వ్యాపారంలో కొనసాగ డం పరిపాటిగా మారిపోయింది. భాగ్యనగర్‌ శివారులో ఈ మత్తుపదార్థాల వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా ఒక వ్యూహం ప్రకారం తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు.

గతంలో ఈ విషయం బయటపడినా పోలీ సులు సమగ్రమైన దర్యాప్తు చేపట్టి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. కూక ట్‌పల్లిలో చంద్రశేఖర్‌ అనే వ్యాపారిని మధ్యప్రదేశ్‌కు చెంది న కొందరు ఈ మత్తు సరఫరాదారులు హైదరాబాద్‌కు వచ్చి హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా చేసిన ప్రయత్నం వెలుగు చూడడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయినా ఆదిలో ఈకేసు విషయంలో కొంత హడావ్ఞడి చేసినా నేటికీ ఆ దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కిరాలేదు.

హైద రాబాద్‌లోనో, లేక తెలంగాణరాష్ట్రంలోనో పటిష్టమైన చర్య లు చేపట్టి ఈ మత్తు వ్యాపారాన్ని నిరోధించడం సాధ్యమ య్యే పనికాదనే పోలీసుల వాదనను కూడా కాదనలేం. ఈ మత్తుపదార్థాలు పొరుగు రాష్ట్రాలేకాదు దేశవ్యాప్తంగానూ ఆమాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా అంతకంతకు విస్తరిస్తున్న ది. రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం కలిసి కట్టుగా ఒక నిర్దిష్టప్రణాళికతో చర్యలు చేపడితే తప్ప ఇది ఆగే పరిస్థితి కన్పించడం లేదు.

అగ్రరాజ్యం మొదలు ఆంధప్రదేశ్‌, తెలంగాణాలోని మారుమూల గ్రామాలకు ఈ మాదకద్రవ్యాల ముఠాలు ప్రమాదకరంగా విస్తరించాయి. కేవలం మెక్సికోలోని మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం విలువ ఏటా ఎనిమిదివేల కోట్ల డాలర్లకుపైగా ఉంటుందని అంచనా. అప్ఘనిస్తాన్‌, గల్ఫ్‌ దేశాలతోపాటు పాకిస్థాన్‌లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారవర్గాలే వివరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మత్తు వినియోగదా రుల సంఖ్య కోట్లకు ఎగబాకింది.

మాదకద్రవ్యాల ఉత్పత్తి, తరలింపు, వాడకం ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అంతర్జాతీయంగా హెరాయిన్‌ వాడకం దాదాపు నాలుగువందల టన్నులకు మించి ఉండవచ్చునని మాదకద్రవ్యాల ప్రపంచ అధ్యయన నివేదిక వెల్లడించింది. భారత్‌తో సహా అప్ఘన్‌, మయన్మార్‌, అమెరికా, బల్గేరియా తదితర దేశాల్లో మాదకద్రవ్యాల వినియోగం అంతకంతకు పెరిగిపోతున్నది. ఆత్మహత్యలకు కూడా ఇదొక కారణమవ్ఞ తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

ఈ మత్తు పదార్థాలను మద్యంలో కలిపి తీసుకోవడం పెరిగిపోతు న్నది. ఇందువల్ల మరిన్ని అనర్థాలకు దారితీస్తుందని ఆరో గ్యాన్ని దెబ్బతీస్తున్నదని పలువ్ఞరు వైద్యనిపుణులే స్పష్టం చేస్తున్నారు. నల్లమందుతో ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్న యువత పెద్దసంఖ్యలో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి గుర్తిం చింది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, కజికిస్థాన్‌ వంటి దేశాల్లో నిషేధిత మత్తుమందులను పాతిక కోట్ల మందికిపైగా వాడు తున్నట్లు అంచనా. ఇక మత్తుపదార్థాలకు భారత్‌ అదిపెద్ద మార్కెట్‌గా తయారయింది. మారుతున్న జీవన విధానం, అపరిమిత ఆదాయం యువతను ఈ దిశగా నడిపిస్తున్నది.

ఈ మాదకద్రవ్యాల విషవలయంలో బలైపోతున్నది యు వతీయువకులే. ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువ్ఞతున్న బాలబాలికలను ఒక వ్యూహం ప్రకారం ఎరవేసి ఈ మత్తు లోకి దించుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఊహించుకోవచ్చు.హుక్కాకేంద్రాలు, రెస్టారెంట్లు, వ్యాయా మశాలలు, నగరాల శివార్లలోని పారిశ్రామికవాడల దాకా వ్యాపించిన ఈ మత్తుపదార్థాల వాడకం జాతి భవితనే ప్రశ్నార్థకం చేస్తున్నది.అంతేకాదు తిరుమల, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలలో సైతం ఈ వ్యాపారం విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. హైదరాబాద్‌ నగర శివారుల్లోనే కొన్ని ప్రయోగశాలల్లో నిషిద్ధ మాదకద్రవ్యాల తయారీ గతంలో బయటపడింది. ఇక గంజాయి సాగు మరొకపక్క ఊహించని రీతిలో విస్తరిస్తున్నది.

మిరపతోటలు, కంది, బంతిపూల సాగుమాటున గంజాయిని పెంచుతున్నట్లు బయటపడింది.అంతర్‌రాష్ట్ర ముఠాలు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో సరుకులను సరిహద్దులను దాటించి అనుకు న్న ప్రదేశాలకు చేరుస్తున్నారు. భారతదేశంలో మాదకద్ర వ్యాలవాడకానికి పంజాబ్‌ కేంద్రంగా మారిందని చెప్పొచ్చు. డెబ్భైశాతం మందికిపైగా యువజనులు ఈ మత్తుకు బాని సలవ్ఞతున్నారని అనేక సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాలకుల్లో త్రికరణశుద్ధిలేకపోవడం వల్లనే దీనిని నియం త్రించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అమెరికా లాంటి దేశంలో కొంత మేరకైనా నిరోధించగలుగుతున్నా రు.ఏటా దాదాపు ఇరవైఐదువేల మందికిపైగా అదుపులోకి తీసుకుంటున్నట్లు అమెరికన్‌డ్రగ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ స్పష్టం చేస్తున్నది. ఇప్పటికైనా ప్రధానంగా కేంద్రపాలకులు ఈ మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్నిమార్గాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలి. మత్తుపదార్థాలు ఏ రూపంలో ఎక్కడ ఉన్నా నిర్దాక్షిణ్యంగా కూకటివేళ్లతో పెకిలించాలి.

ఇందుకు అవ సరం అయితే చట్టానికి మరింత పదును పెట్టాలి.

-దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌