మచిలీపట్నంలో కరోనా వైరస్‌ కలకలం

ఢిల్లీ నుండి వచ్చిన విద్యార్థికి కరోనా లక్షణాలు

Coronavirus
Coronavirus

కృష్ణా: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనావైరస్‌ విస్తరిసుంది. ఈనేపథ్యంలో మచిలీపట్నంలో కరోనా కలకలం రేగింది. ఢిల్లీ నుండి వచ్చిన ఒక విద్యార్థికి కారోనా లక్షణాలు ఉన్నట్టు సమాచారం. బాధితుడు ఒక డాక్టర్‌ అన్న కొడుకు కావడంతో ఇంట్లోనే ఉంచి వైద్యం అందిస్తున్నటు తెలుస్తుంది. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తున్నటు సమాచారం రావడంతో మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశారు. సమాచారం బయటకు పొక్కడంతో ఆసుపత్రికి రాకుండా ఇంటివద్దనే చికిత్స అందిస్తున్నారని వినికిడి. బాధితుడిని గుర్తించే పనిలో అధికారులు నిమగమయ్యారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/