మక్కా పేలుళ్లకు, నా రాజీనామాకు సంబంధం లేదు

RAVINDER REDDY
RAVINDER REDDY

హైదరాబాద్‌: తన రాజీనామాకు మసీదు పేలుడు కేసు తీర్పునకు సంబంధం లేదని రాష్ట్ర న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. ఎన్‌ఐఏ కోర్టు జడ్జీగా మక్కా మసీదు పేలుడు కేసులో తానెలాంటి ఒత్తిడీ ఎదుర్కోలేదన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల జడ్జిల అసోసియేషన్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు, న్యాయాధికారులపై ఎసిబి దాడుల వల్ల మనస్తాపంతోనే తాను రాజీనామా చేసినట్టు వెల్లడించారు. న్యాయాధికారులపై ఆరోపణలు వస్తే అంతర్గతంగా విచారణ జరిపితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.