మంద‌కృష్ణ మ‌ళ్లీ అరెస్ట్‌

Manda Krishna
Manda Krishna

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరోసారి అరెస్ట్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంగళవారం పార్శీగుట్టలో ఉపవాస దీక్ష ప్రారంభించిన ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఉపవాస దీక్షకు దిగడంతో పోలీసులు మందకృష్ణని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా మందకృష్ణ మాట్లాడుతూ.. 24 సంవత్సరాల నుంచి ఓపికతో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతిస్తుంది కానీ.. పార్లమెంటులో మాత్రం బిల్లు ప్రవేశపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులలో పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తనను అరెస్ట్ చేసినా కూడా దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం ఎమ్మార్వో, కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనలు శాంతియుతంగా చేయాలని, గురువారం రహదారులపైన శాంతి యుత ఆందోళనలు చేయాలని ఈ సందర్భంగా మందకృష్ణ పిలుపునిచ్చారు. నిర్భందాలతో దళితులకు దూరం కావద్దని.. బాధ్యతతో మా హృదయాలను చురగొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు.