మందులతో జాగ్రత్త..

medicine
medicine

మందులతో జాగ్రత్త..

సరైన విస్తృతమైన గుర్తింపు లేని చీటీలు లేనందు వలన కలిగే నష్టాలు ఏమిటంటే – మామూలుగా తెలిసీ తెలియని రోగులు తమకు తామే మందుల మోతాదులను ఎంచుకోవడం మొదలు పెడుతున్నారు. పలు అధ్యయనాల్లో మందుల మోతాదులు సరిగ్గా ఉండటం లేదని వెల్లడైంది. పిల్లల ఆరోగ్య పరిస్థితులు, మందుల మోతాదు మొదలైన విషయాల పట్ల ఆందోళన కలిగిస్తున్నాయి.

అందరు పిల్లల డాక్టర్లూ ఖచ్చితంగా చెబుతున్నట్లు, తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే మందుల గురించి సరైన మోతాదులను గురించి అవగాహన కలుగజేసుకోవలసిన అవసరమెంతైనా ఉందనిపిస్తోంది. ఈ విషయంలో మందులు తయారుచేసే కంపెనీలు, మందుల చీటీలు రాసే డాక్టర్లు వాటి గురించి చెప్పవలసి ఉంది. మందులను గురించిన చీటీలపై మోతాదులను తేలికగా, సులభంగా తెలుసుకునేలా వివరించాలి.

యాంటీ బయాటిక్స్‌ను సరైన మోతాదులో ఇవ్వనప్పుడు సూక్ష్మక్రిములకు మందులను ఎదిరించే భయంకర శక్తి కలుగుతుంది. ఒక గుర్తింపు పొందిన మందు వారి బిడ్డను నయం చేయలేదని చెప్పే తల్లిదండ్రులు ఎంతమందో ఉన్నారు. ఈ పరిస్థితిలో పెద్దల విషయంలో ‘మంచిమందులను తలి దండ్రులు వాడుతుంటారు. ఆ విధానాన్ని పిల్లల విషయంలో కూడా ఉపయోగిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు ఒకే వేళలో రెండు విధాలకంటే ఎక్కువగా ఇచ్చే మందులు ‘బలహీనమైనవని అనుకుంటారు.

దీనితో వారు వాపు తగ్గించే ఒక బలమైన మందును ఇస్తారు. దాని వలన పిల్లలకు ఏర్పడే సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి తెలుసుకోకుండానే ఇవ్వడానికి తయారవుతారు. మందులను వాడే వారు అధిక మోతాదు అవుతుందున్న భయంతోనో, లేదా ఒక గడుసు పిల్లవాడిని అదుపులో పెట్టలేక ఒకటి రెండు స్పూనుల కంటే అధికంగా మందును పిల్లలకు ఇవ్వకూడదని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇలాంటి పిల్లలకు ముఖ్యంగా ఐదునుంచి పన్నెండేళ్ల వయస్సులో ఉన్నవారికి సరిపడని మందులు ఇచ్చి, వారి జబ్బుకు తగిన వైద్యం జరుగకుండా చేస్తున్నారు. మందులను ఉపయోగించే వారి కోసం ‘చేయండి, చేయకండి అనే వివరణపత్రాలను సులభంగా అర్థమయ్యే విధంగా తయారు చేయడం అత్యంత అవసరం. చాలా కంపెనీలు వాటిని క్లుప్తంగా వివరిస్తున్నాయి.

ఇటీవల కాలంలో మంచి వివరణలను, తమమందుల గురించిన పూర్తి వివరణలను ఇవ్వడానికి కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. పిల్లలకు జ్వరం, నొప్పులు మొదలైనవి వస్తే నయం చేయడానికి పారాసిటమాల్‌ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒకటి రెండు స్పూన్ల మందే చాలు. అయినప్పటికీ ఐదునుంచి పన్నెండు ఏళ్ల వయస్సు కలిగిన పెద్ద పిల్లలకు మంచి గుణాన్ని కోరుతూ 120 మి.గ్రా./5మి.లీ. పారాసిటమాల్‌ కలిపిన సస్పెన్షన్‌ను 3 నుంచి 4 స్పూన్లు కావాలని పేర్కొన్నారు. డాక్టర్లు, మందులను ఉపయోగించేవారు ఇచ్చిన జవాబులను బట్టి ఇటువంటి మందులను అధిక మొత్తంలో పిల్లలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.

అంటే వారికి అవసరమైన స్థాయిలో మందులను అందించలేకపోతున్నదని ఈ అధ్యయనం వెల్లడి చేస్తున్నది. తమ పిల్లలకు ఇచ్చే మోతాదును తల్లిదండ్రులు మొదటే తెలుసుకోవడానికి వీలుగా క్లుప్తంగా స్పష్టమైన వివరణ మందుతోపాటుగా ఉండాలి. అప్పుడే మందును సరైన మోతాదులో ఇవ్వడం సాధ్యమవుతుంది. రోగులు త్వరగా ఆరోగ్య వంతులవుతారు. ఈ విషయంలో అన్ని ఔషధ కంపెనీలు ఒకేలా వివరణ పత్రాలను రూపొందించేందుకు ముందుకు రావాలి. ప్రతిరోజూ పోషకాహారం తీసుకునేవారికి పండ్ల అవసరం అంతగా ఉండదేమో కాని, అనారోగ్యం పాలైనప్పుడు మాత్రం వాటి అవసరం ఎంతగానో కనిపిస్తుంటుంది.