మందకృష్ణకు బెయిల్‌ మంజూరు

Manda Krishna
Manda Krishna

హైదరాబాద్‌: మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు సికింద్రాబాద్‌ కోర్టు బెయిల్‌ మంజూరు
చేసింది. ఇటీవల ఓ నిరసన కార్యక్రమంలో రెచ్చగోట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో చిలకలగూడ పోలీసులు మందకృష్ణను అరెస్ట్‌ చేశారు.
మందకృష్ణతో పాటు ఆయన అనుచరులను కూడా అదుపులో తీసుకున్నారు. కాగా, తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ మందకృష్ణ, ఆయన
అనుచరులను సికింద్రాబాద్‌ కోర్టులో పిటిషన్‌ వేయగా పిటిషన్‌ను తిరస్కరించింది. కానీ అనుచరులకు మాత్రం బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా
మందకృష్ణ బెయిల్‌ కోసం మళ్లీ పిటిషన్‌ వేయగా కోర్టు విచారించి, షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో జనవరి 2వ తేదీ నుంచి జైల్లో ఉన్న మందకృష్ణ మరికాసేపటిలో బెయిల్‌పై విడుదల కానున్నారు.