మంత్రి హ‌రీష్‌పై ఎమ్మెల్యే అరుణ వ్యాఖ్య‌లు

 

DK Aruna
D K Aruna

వనపర్తి: కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని మంత్రి హరీశ్‌రావు అనడం విడ్డూరమని ఎమ్మెల్యే డీకే అరుణ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలందరం మంత్రి వెంట వెళ్తామని.. నిరూపించాలని సవాల్ చేశారు. లేనిపక్షంలో మంత్రి పదవికి హరీశ్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీపనగండ్లలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా మాట్లాడుతూ 24 గంటల ఉచిత కరెంట్‌లో కోట్ల రూపాయల స్కాం ఉందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే గుట్టు రట్టు చేస్తామన్నారు. జూపల్లి కాంగ్రెస్‌లో ఉండి పార్టీని ఖతం చేయాలని చూశారని డీకే అరుణ చెప్పారు.