మంత్రి పోచారంతో ఎంపీ కవిత భేటీ

Kavitha & others
Kavitha & others

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత కలిశారు. మంత్రితో ఎంపీ కవిత భేటీ అయి నిజామాబాద్‌లో హరితహారం,ఇతర సంక్షేమ అభివృద్ధి అమలుపై ఈ భేటీలో చర్చించారు. ఈ భేటీలో నిజామాబాద్‌,కామారెడ్డి ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.