మంత్రి నారా లోకేష్ కు అమెరికాలో ఘన స్వాగతం !

grand welcome to lokesh
grand welcome to lokesh

వాషింగ్ట‌న్ః ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు పంచాయతీ రాజ్ శాఖామంత్రి నారా లోకేష్ కు డల్లాస్ లో ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు, పాలసీలతో పెద్ద కంపెనీలు మనరాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ఇప్పటికే కియా, అపోలోటైర్స్, ఇసుజూలాంటి కంపెనీలు వచ్చాయన్నారు. ఐటిరంగం, ఎలక్ట్రానిక్స్ తయారీరంగాలు కూడా భాగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని, ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు అంతా భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈసందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ లోకేష్ అమెరికా పర్యటనలో విజయవంతమవ్వాలని లాస్ యాంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్, అట్లాంటా, న్యూయార్క్, బోస్టన్ నగరాల పర్యటన ద్వారా మరిన్ని నూతన సంస్థలు, పెట్టుబడులు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.
ఈకార్యక్రమంలో సతీష్‌ మండువ, సురేష్ మండువ, సాంబదొడ్డ, శ్రీకాంత్ పోలవరపు, శ్రీనివాసరావు కొమ్మినేని, సతీష్ కొమ్మన, అనిల్ కుర్ర, రాజనెల్లూరి, ప్రవీణ్ కొడాలి, దినేష్, జనార్దన్, వెంకట్‌ తోట్టెంపుడి, శ్రీని, చిన్నపురెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.