మంత్రివ‌ర్గ స‌మావేశంలో ప‌లు నిర్ణ‌యాలు

Chandrababunaidu
Chandrababunaidu

అమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం సాయంత్రం సమావేశమైన ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిని ఆమోదించింది. విశాఖ జిల్లా నక్కపల్లిమండలంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం 448.88 ఎకరాల భూమిని ఏపీఏడీసీఎల్‌కు అప్పగించేందుకు కేబినెట్‌ అంగీకరించింది. వీటితో పాటు రూ.5 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ ఉన్న తెలుగు, హిందీ, ఇంగ్లీష్ యానిమేషన్ సినిమాలకు 50 శాతం స్టేట్ జిఎస్టీ రాయితీ కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఐటీ పాలసీతో పాటు అదనంగా ఎంప్లాయ్‌మెంట్ రాయితీ కల్పించనున్నారు.