మంత్రితో కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం

Pocharam Srinivas Reddy
Pocharam Srinivas Reddy

హైదరాబాద్‌: మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు కేటిఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. పంట పెట్టుబడి పథకంపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ వర్షాకాలం నుంచి వ్యవసాయానికి పెట్టుబడి మద్దతు పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో పథకం అమలు కోసం మంత్రి పోచారం అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీని వేసిన విషయం తెలిసిందే.