మండే ఎండ.. ఆరోగ్య సూత్రాలు

Summer2
Summer

మండే ఎండ.. ఆరోగ్య సూత్రాలు

ఈ ఎండాకాలం దేహాన్ని, మనస్సుని చికాకు పరు స్తుంది. తీవ్రమైన ఎండలో ఫరవాలేదు అనుకుని తిరి గితే చాలా బాధపడతాం. అమెరికా, లాటిన్‌ దేశాల్లో కన్నా మన దేశంలో సూర్య ప్రతాపం ఎక్కువ కావడమే కాదు, ఒరిస్సా, రాజస్థాన్‌ వంటి రాష్ట్రా లలో ఈ కాలంలో మరణాలు కూడా అతి సామా న్యం. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో విపరీతమైన చలి తర్వాత విపరీతమైన ఎండలు ఉంటాయి. హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ వంటి ప్రదేశాలలో ఎండ మనిషిని కాల్చేస్తుంది. ఎండలో ప్రయా ణం చేసిన పుడు చెమట పట్టడం మానేసి చర్మం పొడిగా, బిగుతుగా ఉన్నట్లనిపించి, వెంట్రుకలు నిటారుగా ఉంటే ఎండ తీవ్రత మన శరీరంపై చెడు ప్రభావం చూపిస్తుందని సూచన. అటువంటి పరిస్థితిలో వెంటనే పాదాలు, శరీరం, తల, నుదురు తడి బట్టతో గాని, ఐస్‌తోగాని తడుపుకోవాలి. ఏమవ్ఞతుం దిలే అని అశ్రద్ధ చేస్తే జ్వరలక్షణాలు కనిపి స్తాయి. శరీరంలో చర్మం ముడుచుకునే శక్తిని కోల్పోతుంది. జీర్ణకోశం చెడుతుంది. వికారం అనిపిస్తుంది. వాంతులవడం, విరేచనాలు కావడం ప్రారంభమవ్ఞతుంది. ఆ తర్వాత హృదయం, బుద్ధి వీటిపై ప్రభావం చూపుతుంది. వేసవి తప్పించుకునేందుకు సిమ్లా, ఊటీ వెళ్లాల నుకున్న వారు గ్రామాలకు వెళ్లవచ్చు. మందార, పువ్వాగ, జాజిపుష్పాలతో నిండిన, మామిడి, వేప చెట్లతో నిండిన వనాలయందు ఉండాలని ఆయుర్వే దం చెపుతుంది. దక్షిణం వైపు నుంచి వచ్చే గాలితో మన శరీరం చల్లబడితే చాలా మంచిది.

మట్టికుండ లోని నీళ్లలో కొద్దిగా వట్టి వేరు వేసి నానబెట్టి, నాలుగు గంటల తరువాత ఆ నీటిని వడియకట్టి అందులో కొంచెం పంచ దార కలుపుకుని తాగితే ఎండ వేడిమి ప్రభావం ఒంటికి ఉండదు. అలాగే వరండాలలో చిన్న పందిరివేసి నాలుగు వైపులా సువాసన వచ్చే పూల దండలు, మామిడి చిగుళ్లు, వేలాడదీసి పన్నీరు కలిపిన నీళ్లు చల్లితే ఆ గాలి ఎంతో సరదాగా, ఆహ్లా దంగా ఉంటుంది. ఈ వేసవిలో వీలయినంత వరకు సాయంత్రాలు గంధం పూసుకుంటే చర్మం కమిలి పోకుండా నిగనిగలాడుతుంది. పసిపిల్లలకు, చిన్న పిల్లలకు ఈ కాలంలో ఉదయం వేళలో నువ్ఞ్వల నూనెతో శరరమంతా రాసి పెసరపిండి, గంధపు పొడి, పసుపు కలిపి ముద్దగా చేసి ఒంటికి నలుగు పెట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయించి పలుచటి బట్టలువేస్తే చెమట వల్ల వచ్చే సమస్యలు వారి దరి చేరవ్ఞ. హాయిగా ఉంటారు. ఒక గ్లాసు నీళ్లలో తొమ్మిది ఎండుద్రాక్షలు, రెండు ఎండు ఖర్జూరాలు, నానబెట్టి నాలుగు గంటల తర్వాత వాటిని తీసి బాగా పిండి ఆ పిప్పిని తీసివేసి ఆ నీళ్లలో ఒక చెమ్చా తేనె కలిపి తాగిస్తే ఎండవేడిమి వల్ల వచ్చే నీరసం తగ్గి, మంచి శక్తి వస్తుంది. కొంచెం పెద్ద పిల్లలకు ఇంట్లోనే చెరకురసం. ద్రాక్ష రసం, దానిమ్మ రసం వంటి పళ్లరసాలు తయారు చేసి ఐస్‌ లేకుండా తాజాగా ఉండగానే తాగటానికి ఇస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండగలుగుతారు.

మధ్యాహ్నం భోజనాలు చేసిన తరువాత చిలికిన వెన్నతో ఉన్న మజ్జిగలో చిటికెడంత ఉప్పు వేసి రెండు కరివేపాకు రెబ్బలు వేసి తాగటానికి ఇచ్చినా, అన్నంలో కలుపుకున్నా మంచిదే. ఇది పెద్దవారు తాగవచ్చు. దాహం తీరుతుంది. కడుపులో చల్లగా ఉంటుంది. ఈ వేసవిలో శరీరశక్తి, మేధోశక్తి పెంచేలా నూనెలతో తయారుచేసే అల్పాహారాలు కాకుండా, రాత్రి కాచిన పాలు ఒక గిన్నెలో పోసి రెండు గరిటెల అన్నం వేసి, అందులో తరిగిన ఉల్లిముక్కలు, రెండు అల్లం ముక్కలు, రెండు చిటికెల వాము వేయాలి. ఒక చెమ్చా మజ్జిగవేసి మూతపెట్టాలి. తెల్లారిన తర్వాత తోడుకుంటుంది. ఈ ఆహా రాన్ని పిల్లలకు ఉదయం వేళ అల్పాహారంగా ఇస్తే ప్రొటీనులు, విటమిన్‌లు వారికి శరీరానికి అందుతాయి. దీనివల్ల ఎదుగుతున్న పిల్లలకు శరీరదారుఢ్యం పెరుగుతుంది. పాతబెల్లం, నువ్ఞ్వలు కలిపి చేసిన ఉండలు ఆడపిల్లలకు రోజుకు రెండు చొప్పున ఇస్తే వాళ్లలో హార్మోన్స్‌ నిశ్చలంగా ఉంటాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావు.