మంచి స‌బ్జెక్ట్‌తో ‘యు’

U PRESSMEET
U PRESSMEET

శ్రీమ‌తి నాగానిక స‌మ‌ర్ప‌ణ‌లో కొవెరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కొవెరా, హిమాన్షి కాట్ర‌గ‌డ్డ హీరో హీరోయిన్‌గా కొవెరా ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌ల‌క్ష్మి కొండా నిర్మించిన చిత్రం `యు`…`క‌థే హీరో` ట్యాగ్ లైన్‌. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 28న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

బాలాజీ నాగ‌లింగం మాట్లాడుతూ – “చాలా మంచి స‌బ్జెక్ట్‌తో యు చిత్రం తెరకెక్కింది. అవినీతి, అక్ర‌మాల‌ను సందేశాత్మ‌కంగా.. చ‌క్క‌గా తెర‌కెక్కించారు. కొవెరా హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం చేయ‌డం గొప్ప విష‌యం. త‌న‌కు రెండు విభాగాల్లో చాలా మంచి పేరు వ‌స్తుంది“ అన్నారు.

స్క్రీన్ ప్లే రైట‌ర్ మ‌ధు మాట్లాడుతూ – “తెలుగు తెర‌పై ఇప్ప‌టి వ‌ర‌కు రానటువంటి కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రం `యు`. హీరో, ద‌ర్శ‌కుడిగా చేసిన కొవెరాకు ఈ సినిమాతో చాలా మంచి పేరు వ‌స్తుంది. సినిమా డిసెంబ‌ర్ 28న విడుద‌ల కానుంది“ అన్నారు.  ముత్యాల రాందాస్ మాట్లాడుతూ – “చిన్న సినిమాల‌ను విడుద‌ల చేయాలంటే మినిమం ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు కావాలి. సినిమా కాన్సెప్ట్ బాగాలేక‌పోతే ఆ డ‌బ్బులు కూడా రావ‌డం లేదు. కాబ‌ట్టి కాన్సెప్ట్ బావుంటేనే సినిమాల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అలాంటి కాన్సెప్ట్ యు సినిమాలో ఉంది. ట్రైల‌ర్‌, టైటిల్ బావుంది. త‌ప్ప‌కుండా సినిమా ప్రేక్ష‌క‌లను అల‌రిస్తుంది“ అన్నారు.  హీరో, ద‌ర్శ‌కుడు కొవెరా మాట్లాడుతూ – “ముందుగా డిసెంబ‌ర్ 14న సినిమాను విడుద‌ల చేయాల‌న‌కున్నాం. కుద‌ర‌లేదు.. ఇప్పుడు డిసెంబ‌ర్ 28న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఇలాంటి ఆలోచ‌న‌తో కూడా సినిమాలు చేయ‌వ‌చ్చా అనేంత గొప్ప‌గా సినిమా ఉంటుంది. శంక‌ర్‌గారి ఇన్‌స్పిరేష‌న్‌తో ఇలాంటి డిఫ‌రెంట్ సినిమాను చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాను. వంద‌కోట్ల సినిమాను కోటి రూపాయ‌ల‌తో తెర‌కెక్కించాం“ అన్నారు.
కొవెరా, హిమాన్షి కాట్ర‌గ‌డ్డ‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, స్వ‌ప్న రావ్‌, ల‌హ‌రి(మ‌ళ్ళీరావా ఫేం), ఉప్ప‌ల‌పాటి నారాయ‌ణ‌రావు, రాఘ‌వ‌, నాగి, రోహిణి, సంధ్య‌, దొర‌బాబు త‌దితరులు న‌టించిన ఈ చిత్రానికి పాట‌లు: గురుచ‌ర‌ణ్‌, కిస్సు విస్సాప్ర‌గ‌డ‌, సురేశ్ బ‌నిశెట్టి, కొరియోగ్ర‌పీ: విజ‌య్ పోలాకి, స‌తీష్‌, ఫైట్స్‌: షావోలిన్ మ‌ల్లేష్‌, డైలాగ్స్‌: మ‌హి ఇల్లింద్ర‌, క‌రుణ్ వెంక‌ట్‌, స్క్రీన్ ప్లే: కొవెర‌, మ‌ధు విప్ప‌ర్తి, ఆర్ట్‌: రాజీవ్ నాయ‌ర్‌, మ్యూజిక్‌: స‌త్య మ‌హావీర్, సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్‌: రాకేష్ గౌడ్ మైసా, కో ప్రొడ్యూస‌ర్‌: మూర్తి నాయుడు పాదం, లైన్ ప్రొడ్యూస‌ర్: ర‌మేష్ కైగూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: నాగ శివ‌గ‌ణ‌ప‌ర్తి, ఎ.ఆర్‌.శౌర్య‌రాజ్‌, నిర్మాత‌: విజ‌యల‌క్ష్మి కొండా, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కొవెరా.