మంచి ఆశయంతో పోలవరం కడుతున్న చంద్రబాబు

Pawan Kalyan in JANASENA KAVATU
Pawan Kalyan

రాజమండ్రి: సర్‌ఆర్దర్‌ కాటన్‌ ఉన్నత ఆశయంతో ధవళేశ్వరం ఆనకట్ట కట్టారని, అలాగే ఇప్పుడు చంద్రబాబు కూడా మంచి ఆశయంతో పోలవరం కట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన తూ.గో.జిల్లా రాజమండ్రిలో జనసేన కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. తాను తెలుగువాడినని చెప్పడానికే పంచె కడుతున్నానని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, పెట్టుబడులు రావాలని ఆకాంక్షించిన పవన్‌..ప్రజలను భయపెట్టి భూములు లాక్కోకూడదని ప్రభుత్వానికి సూచించారు. సమాజం కోసం, దేశం కోసం చనిపోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.