మంకుపట్టు పడితే…

crying
crying

మంకుపట్టు పడితే…

కుటుంబంలో అందరూ తనకు కావలసినట్లుగా ప్రవర్తించాలని గాని, అడిగిన వస్తువ్ఞ పొందాలనిగాని, ఇష్టం లేని పని జరగకుండా ఉండాలని గాని తలంచినపుడు, తాననుకున్న పనే జరిగి తీరాలని మొండిపట్టు పట్టే పిల్లలు అరవడం, సామాన్లు విసరడం, కాళ్లు నేలపై గట్టిగా కొడుతూ ఏడ్వడం, ఊరికే నసపెట్టడం, తన్నడం, కుటుంబ సభ్యులతో మాట్లాడ్డం మానివేయడం, తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, చేతులతో తల బాదుకోవడం, గోడకో, వస్తువ్ఞలకో పెట్టి తలను కొట్టుకోవడం, కరవడం వంటి వాటిలో ఏది చేసినా వాటిని టెంపర్‌ తాంత్రమ్స్‌ అంటారు.

వీళ్లు తన శక్తిని తల్లిదండ్రులకు చూపించడానికి వారి దృష్టి నాకర్షించడానికి జరిగే ఒక నాటకీయమైన ప్రవర్తనలో భాగంగా ఇవి అలవాటవ్వవచ్చు. ఏదో ఒక పనిచేస్తే, కుటుంబసభ్యులు, తనపై దృష్టి నిలుపుతారని గ్రహిస్తే వీలయినప్పుడల్లా అదే పద్ధతిని అవలంబిస్తారు. కుటుంబసభ్యులు పిల్లలెదురుగానే తమ స్నేహితుల వద్ద వారు చేసే అల్లరి, మొండితనాల గురించి చర్చించడం సాధారణం. ఇలా తమలో తాముగాని, బంధువ్ఞల వద్ద గాని, స్నేహితుల వద్ద గాని, పిల్లల స్నేహితుల వద్ద గాని, పిల్లలు చూస్తుండగానే తమ పిల్లల మొండితనం గురించి వారన్నది నెగ్గకపోతే చేసే అల్లరి గురించి మాట్లాడ్డం మొదలుపెడితే వారిలో ఈ సమస్య మరింత పెరగడం మొదలవ్ఞతుంది.

కాబట్టి పిల్లల ముందు వారి నెగిటివ్‌ విషయాన్ని చర్చించవద్దు. ఏ టీవీనో చూపిస్తూ మా పిల్లలు కూడా అంతే అని కామెంట్‌ చేయవద్దు. దీనివల్ల వారిలో మరింత అల్లరితనం ఎక్కువవ్ఞతుంది. అలా చేస్తున్నప్పుడు వారి మీద దృష్టి పెట్టకుండా ఎవరి పని వారు చేసుకుంటుంటే కొద్దిసేపటికి వారు యధాస్థితికి వచ్చేస్తా రు. అలాకాకుండా దెబ్బతగులుతుందని ఆలోచించి వారు అడిగింది కొని ఇస్తే ఇక ఏది కావాలన్నా అలాంటి పేచీలే పెడతారు.
===