భ‌ద్రాద్రి రామాల‌యం మూసివేత‌

Bhadradri Image
Bhadradri Rama temple

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం: సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని భద్రాచలం రామాలయం తలుపులు మూసివేశారు. వేకువ జామునే ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు రామయ్యకు సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ సన్నిధిలో అభినవభక్త శబరి పోకల దమ్మక్క సేవా యాత్రను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దమ్మక్క విగ్రహానికి పుష్పార్చన చేశారు. ఈ వేడుకలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం చిత్రకూట మండపంలో స్వామికి నిత్యకల్యాణం నిర్వహించారు. ఇదిలా ఉండగా సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆలయ తలుపులు మూసివేశారు. శనివారం తెల్లవారు జామున 4.30 నిమిషాలకు తిరిగి రామాలయం తలుపులు తెరిచి సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.